Munugodu bisection results political parties allegations on election commission
mictv telugu

ఫలితాల జాప్యంపై పార్టీల గొడవ.. ఈసీపై ఆరోపణలు నిజమేనా?

November 6, 2022

నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రౌండు రౌండుకు మారుతున్న ఫలితాలతో అభ్యర్థులు ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. కౌంటింగ్ పూర్తయిన రౌండ్ల ఫలితాల వెల్లడిపై జాప్యం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తమ పార్టీకి ఆధిక్యం వచ్చిన రౌండ్ల ఫలితాలను ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ఆరోపిస్తోంది. స్వల్ప ఆధిక్యంతో కొనసాగుతున్న టీఆర్ఎస్ కూడా ఆదే ఆరోపణ చేస్తోంది. అయితే కౌంటింగ్ ఫూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడించడం సాధ్యం కాదని ఈసీ వర్గాల ఆరోపణ. కొన్ని రౌండ్లలో తమకు అనుకూలమైన ఫలితాలు రాకపోతే పార్టీలు ఇలాంటి ఏవో ఆరోపణలు చేస్తుండడం కామేనేని ఎన్నికల పరిశీలకులు అంటున్నారు.
పెద్ద తతంగమే..

ఈవీఎంలలో కౌంటింగ్ సులభమే అయినా ఫలితాల వెల్లడిలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విధి విధానాల ప్రకారమే ఈసీ ఫలితాలు వెల్లడిస్తుంది. ఒక రౌండు ఫలితాల వెల్లడికి అరగంట నుంచి ముప్పావు గంట సమయం పడుతుంది. రౌండ్ పూర్తి అయిన తర్వాత అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధుల కౌంటింగ్ ఏజెంట్ల నుంచి ఈసీ సిబ్బంది సంతకాలు తీసుకుంటారు. సూక్ష్మస్థాయి పరిశీలకుడు (మైక్రో అబ్జర్వర్), కేంద్ర ఎన్నికల పరిశీలకులు కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏవైనా రెండు ఈవీఎంలలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు ఫలితాల రికార్డులతో సరిచూస్తారు. ఈవీఎంలతో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్లలో వచ్చిన ఓట్లత కచ్చితంగా సరిపోవాలి. ఫలితాలపై తమకు అభ్యంతరం లేదని ఏజెంట్లు చెప్పిన తర్వాత ఆర్వో రౌండ్ ఫలితాలు అధికారికంగా వెల్లడిస్తారు. ఈ మొత్తం క్రమోం ఎవరైనా అభ్యంతరాలు చెప్పినా, లెక్కల్లో తేడాలు వచ్చిన ఫలితం ఆలస్యం అవుతుంది.