Munugodu bjp candidate komati reddy rajgopal Reddy leaves vote counting center
mictv telugu

కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికొచ్చిన రాజగోపాల్ రెడ్డి

November 6, 2022

మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో ముందుకు దూసుకెళ్తోంది. ఐదో రౌండు ముగిసేసరికి బీజేపీపై వెయ్యి వోట్లకు పైగా ఆధిక్యంతో కొనసాగుతోంది. దీంతో నిరాశ చెందిన కమలం అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి రావడం గమనార్హం. చౌటుప్పల్ మండలంలో తాము ఆశించిన మెజారిటీ రాలేదని ఆయన విలేకర్లతో అన్నారు. రౌండు రౌండుకు ఫలితాల సరళి మారుతోందని, అయినా గెలుపు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ‘ఆశించిన స్థాయిలో ఓట్లు దక్కలేదు. లెక్కించాల్సిన‌వి ఇంకా ఉన్నాయి కాబ‌ట్టి వేచి చూద్దాం’ అని అన్నారు. ఆ అసంతృప్తితోనే ఆయన బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. రౌండు రౌండుకు ఫలితాలు మారుతుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఏం చేయాలో అర్థం కాకుండా గందరగోళపడుతున్నారు.