Munugodu Bypoll,TRS,BJP,CONG,Plan B,
mictv telugu

ఆ 48 గంటలు

November 1, 2022

మునుగోడులో మిగిలింది ఇక గంటలే. హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది.మాటలమంటలకు ఎండ్ కార్డు పడింది. ఇప్పుడు మిగిలింది అంతా ఇంటిఇంటి పలకరింపులే.పలకరింపులంటే మామూలుగా ఉండవు. ఎవరి రేంజ్‌లోవారివి. తగ్గేదేలే అంటూ ప్లాన్ బీ ఎవరు ఎలా అమలుచేయబోతున్నారు.? పక్కాగా అమలు చేసే వారిదేనా గెలుపు? ఏ బై పోల్ లో ఏపార్టీ ప్లాన్ బీ ఎలా అమలైంది. ఎవరికి వర్కౌంట్ అయింది.?

ఇక గుండెల్లో దడ

మైకులతో దంచికొట్టారు.ఇంటింటికెళ్లి కలిశారు. మర్యాద చేశారు. మందుపోశారు. మర్యాద అంటే ఎలా ఉంటుందో మునుగోడు వెళ్లి చూడాలనే లెవల్లో 40 రోజుల పాటు సాగింది. ఖరుదైన కార్లలో పెద్దనాయకులు వచ్చారు. గల్లీలో బెంజ్ కాన్వాయ్‌లు మోత మోగింది. ప్రచార గుంపులు మునుగోడు నియోజకవర్గమంతా తిరిగాయి. మామూలు నాయకుల నుంచి మంత్రుల దాకా ఊర్లని పంచుకుని లెక్కలేసి చుట్టేశారు. కేటాయించిన ఊరిలో ఏ ఇల్లును వదల్లేదు. దాదాపు మూడు పార్టీలు ఇంతే. టీఆర్ఎస్ , బీజేపీ నేతలు ఓ అడుగు ముందే ఉన్నారు. ర్యాలీలతో హోరెత్తించిన పార్టీలు గెలుపుకోసం విశ్వప్రయత్నాలు చేశాయి.

ప్లాన్ బీ పై నజర్
పోలింగ్‌కు ముందు మిగిలిన గంటలే కీలకం. ఈ గంటల్లో పార్టీల స్పీడ్ పై మైలేజ్ ఆధార పడి వుంటుంది. ఇక్కడ ఈసీ రూల్స్ కనిపించవు. ప్రచార ఖర్చుల లిమిట్ పేపర్లకే పరిమితం. ఇది అందరికి తెలిసిన విషయం..ఈ గంటల్లో జరగబోయేది అంతా చీకట్లోనే..పగలు పంచినా ఎవరికి కనిపించదు. ఎందుకంటే చీకటి వ్యవహారం. మాటల వంతు, మందు వంతు,చికెన్ దావత్ ల వంతు పూర్తి అయింది.మిగిలింది పింక్ నోటు టైమ్ వచ్చేసింది. ఎన్ని నోట్లు ఎంతమందికి ఎక్కువ ముడితే వారికి మైలేజ్ వస్తుంది. వారికే గెలుపు ఆశలు అంతకంతకు పెరుగుతాయి. గెలిచేది ఒక్కరే అయినా ప్రయత్నాలు అందురుచేస్తారు. టీఆర్ఎస్ , బీజేపీ మధ్యే అసలు పోటీ నెలకొంది. పోలింగ్ ముందు సమయాన్ని ఎవరు ఎలా తిప్పుకుంటారేమోనని ఉత్కంఠ రేపుతోంది. అంతే కాదు ప్లాన్ బీని ఈ రెండు పార్టీలు నమ్ముకున్నాయి.ప్లాన్ బీ అంటే పోల్‌మేనేజ్మెంట్. ఓటర్‌ని పోలింగ్ బూత్ దాకా రప్పించి వారికే ఓటేలా చూడటం…ఓటేశాక కూడా అవసరమైతే ఇంటిదగ్గర డ్రాప్ చేయడం..హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వుంటే వారిని పంపే ఏర్పాట్లు చేయడం పోల్‌మేనేజ్‌మెంట్‌లో ముఖ్యమైంది.

పోల్‌మేనేజ్‌మెంట్

పోలింగ్‌కు ముందు రోజు ఓటుకు ఇంత అని పార్టీలు డబ్బులు పంచేస్తుంటాయి..అప్పట్లో హుజూరాబాద్ లో ఓ పార్టీ ఓటుకు రూ.6వేలు, మరో పార్టీ ఓటు రూ.10 వేలు పంచింది.కొన్ని ఊర్లల్లో దీనికి మించి డబ్బుల ప్రవాహం కొనసాగింది. ఆ మధ్య ఎమ్మెల్సీ ఓట్లలో ఓటుకు రూ.3వేల నుంచి రూ.6 వేలదాకా ఇచ్చారని పార్టీ నేతలే చెప్పుకున్నారు. పలు సందర్భల్లో డబ్బులు పంచుతూ దొరికిన ఘటనలూ బయటపడ్డాయి. ఇలా దొరికిన వాటిపై చర్యలు తీసుకుంటామన్న ఈసీ..లోలోపల జరిగే వ్యవహారాన్ని పట్టించుకోలేదు.పట్టించుకోదు.ఎందుకంటే ఈసీ కంటికి కనపడకుండా పార్టీలు పనులు చేస్తాయి. చాలా రహస్యంగా ప్లాన్ బీని అమలు చేస్తుంటాయి.

మునుగోడులో రికార్డ్ రేటు

అన్ని ఉప ఎన్నికలు ఒక ఎత్తు అయితే…మునుగోడు ఉప మరో ఎత్తు. గతంలో ఉపఎన్నికల్లో ఖర్చు పెట్టిన మొత్తానికి మించి ఒక్క మునుగోడులో ఖర్చు పెట్టారు. మద్యం ఏరులై పారింది. ఒక్కరోజు కాదు..దాదాపు నెలరోజులు.లిక్కర్ పూల్స్ లో ఈత కొట్టించారు.దావత్‌లు అంతకుమించి చేశారు. వందల క్వింటాళ్ల చికెన్ తినేశారు. ఇప్పుడు మిగిలింది ఒక్కటే. అదే ఓటుకునోటు. డబ్బులు పంపిణీ కార్యక్రమం. ఓ పార్టీ ఇంటికి తులం బంగారమంటే..మరో పార్టీ ఓటుకు పది నుంచి 20 వేలు ఇవ్వొచ్చని స్వయంగా మునుగోడు వాసులు అంటున్నారు. ఈ విషయంలో తగ్గేదేలే అంటూ పంచుడు టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. “వాళ్లు ఇస్తున్నప్పుడు మేము తీసుకోకపోతే బాగుండదు..అన్ని పార్టీల నుంచి తీసుకుంటాం” అని మొహమటంలో లేకుండా కొందరు చెబుతున్నారు. ఇలా ఎవరెన్ని ఇచ్చినా వేయాల్సిన పార్టీకి ఓటు వేస్తామంటున్నారు ఇంకొందరు. వద్దు వద్దు అన్న కూడా పార్టీలు తాయిలాలు ఇస్తున్నాయంటున్నారు మరికొందరు.

పార్టీల టెన్షన్

నెలరోజులు తిరిగారు. మంచి మర్యాద చేశారు.లక్ష క్వింటాళ్ల చికెన్ తినిపించారు.కానీ ఎక్కడ ఎవరికీ మునుగోడు ఓటర్ ఓపెన్ కాలేదు. చూద్దాంలే అంటూ చెప్పుకుంటూ వచ్చారు. మిగిలింది ఆఖరి అంకం.ఇప్పుడైనా ఓటర్ ఏ వైపు ఉంటాడో చూచయగా తెలుస్తుందని పార్టీలు నమ్ముతున్నాయి. డైలీ తెప్పించుకుంటున్న సర్వేలూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాయి. అందుకే టీఆర్ఎస్ , బీజేపీలు టెన్షన్ పడుతున్నాయి. ప్లాన్ బీ పైనే బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. ఏ పార్టీ ప్లాన్ బీ వర్కౌట్ అవుతుందో తెలుసుకోవాలంటే ఆరో తేదీదాకా ఆగాల్సిందే.