Munugodu election congress candidate palvai shravanti leaves vote counting center
mictv telugu

మునుగోడు.. ఇంటికి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి..

November 6, 2022

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్నాయి. రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండడంతో ఇతర పార్టీల అభ్యర్థులు నిరాశతో కౌంటింగ్ కేంద్రాలను వీడుతున్నారు. రౌండు రౌండుకు ఫలితాలు మారుతుండగా నాలుగో రౌండుకల్లా అధికార టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీకి చెందిన తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 714 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్, రెండు, మూడు రౌండ్లలో బీజేపీ, నాలుగో రౌండ్‌లో మళ్ళీ టీఆర్ఎస్ పై చేయి సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మూడో స్థానంలో నిలించింది. ఆశలు వదిలేసుకన్న ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. నాలుగో రౌండు ముగిసేసరికి హస్తం పార్టీకి 7380 ఓట్లు పడ్డాయి. నోటాకు 142 ఓట్లు పడ్డాయి. ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ కు 174 ఓట్లు దక్కాయి.