Munugodu elections results car like symbols like road roller roti maker gets sufficient votes
mictv telugu

మునుగోడు కారుకు.. చపాతీ మేకర్, రోడ్డు రోలర్ దెబ్బలు..

November 6, 2022

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ స్వల్ప ఆధిక్యంతో ముందుకు సాగుతున్న తృప్తి మాత్రమే దక్కుతోంది. కేసీఆర్ పథకాలు, బీజేపీ వైఫల్యాలు వంటి ఎన్నో అంశాలు తమకు భారీ మెజారిటీ సాధించిన పెడతాయనుకున్న గులాబీ శ్రేణులు బొటాబొటి మెజారిటీ దక్కుతుండడంతో ఉసూరుమంటున్నారు. కారును పోలిన గుర్తులు తమకు పెద్దగా కాకపోయినా ఓ మాదిరినే దెబ్బకొట్టాయని వాపోతున్నారు. ఎన్నికల గుర్తుల పంచాయతీ ఈసీకి చేరి కొంత మేరకు ‘కారును పోలిన’ గుర్తులు పీకేయించుకున్నా మిగిలిపోయిన ‘గుర్తులు’ ఎన్నికల్లో బాగానే ఓట్లు దక్కించుకున్నాయి.

దుబ్బాక ఎన్నికల్లో అధికార కారును దెబ్బతీసిన చపాతీ మేకర్ మునుగోడు ఎన్నికల్లోనూ ఓ మాదిరి ప్రతాపం చూపింది.
మునుగోడులో ఎన్నికల్లో చపాతీ మేకర్‌కు 10వ రౌండుకల్లా రోటీ మేకర్ అభ్యర్థి శ్రీశైలం యాదవ్‌కు 1368 ఓట్లు పడ్డాయి. రోడ్డు రోలర్ అభ్యర్థి శివకుమార్‌కు 1060 ఓట్లు పడ్డాయి. మిగతా ఆరు రౌండ్ల ఫలితాలు వస్తే వీరిద్దరికి కలపి 3 వేలకు పైగా ఓట్లు వస్తాయని అంచనా. చెప్పుల గుర్తు అభ్యర్థికి కూడా 1500 ఓట్ల వరకు రావొచ్చని అంచనా.