Munugodu former mla komatireddy Rajagopal Reddy joins in bjp etala Rajender
mictv telugu

21న బీజేపీలోకి కోమటిరెడ్డి, దాసోజు.. ఈటల

August 6, 2022

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోడానికి ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 21న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారని తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్ వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డితోపాటు కాంగ్రెస్‌ను వీడిన దాసోజు శ్రవణ్, నర్సాపూర్ మున్సిపల్‌ చైర్మన్‌ మురళి యాదవ్ తదితర నేతలు కూడా బీజేపీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడాంచారు. శనివారం ఈటల మీడియాతో మాట్లాడారు. బీజేపీలోకి ఎవరొచ్చినా తలుపులు తెరిచే వుంటాయన్నారు. ‘రిటైర్డ్‌ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సహా పలు పార్టీల నాయకులు 15 మంది 21కల్లా బీజేపీలో చేరతారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేవని మండిపడ్డారు. కాగా, తాను బీజేపీలో ఎప్పుడు చేరబోయేది రాజగోపాల్ రెడ్డి ఇంతవరకు వెల్లడించలేదు.