Munugude war super strategies...
mictv telugu

మునుగోడులో సూపర్ స్ట్రాటజీలు..తీన్మార్ లో ఎవరి బలమెంత?

October 19, 2022

Munugude war super strategies...

కమలం ఖాతా తెరుస్తుందా? కారు టార్గెట్ రీచ్ అవుతుందా? కంచుకోటలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంటుందా? మునుగోడులో గెలుపెవరిది? ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.అసలు మునుగోడులో ఎవరు ముందున్నారు.పార్టీల బలాబలాలు ఏంటి? తీన్మార్ వార్ లో మునుగోల్ కొట్టేదెవరు?

మునుగోడు బై పోల్ క్యాంపెయిన్ హీటెక్కింది. పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి.నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుకుంటున్నాయి.సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. కేంద్రమంత్రుల నుంచి రాష్ట్రమంత్రుల దాకా, అగ్రనేతల నుంచి రాష్ట్ర నేతలదాకా మునుగోడు ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఓట్ల వేటలో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ కు ముందే మొదలైన ప్రచారం..ఇప్పుడు పీక్ స్జేజ్ లో ఉంది. ప్రచారంలో ఏ పార్టీ వ్యూహం ఏంటి?సెమీస్ వార్ లో బలాబలాలు ఇప్పుడు చూద్దాం.

మునుగోడులో తీన్మార్ లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన స్టయిల్లో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి విక్టరీ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాంగ్రెస్ , టీఆర్ఎస్ నుంచి వలసలు బీజేపీకి మంచి బూస్ట్ నిస్తున్నాయి.నియోజకవర్గంలో మంచి పట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కలిసివచ్చే అంశం.బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లస్ , మైనస్ లు ఏంటంటే…

ప్లస్ పాయింట్స్

నియోజకవర్గంలో మంచిపేరు

బీజేపీ అగ్రనేతల ప్రచారం

కాంగ్రెస్ ,టీఆర్ఎస్ నుంచి వలసలు

ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు,వార్డు మెంబర్లు తన వెంటే రావడం

దుబ్బాక,హుజూరాబాద్ స్ట్రాటజీ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటం

మైనస్ పాయింట్స్

మునుగోడు కాంగ్రెస్ కు కంచకోట

క్యాడర్ బీజేపీలో చేరినా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే ఉండటం

కాంగ్రెస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్

అటు టీఆర్ఎస్ పక్కా వ్యూహంతో మునుగోడులో ముందుకుసాగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ లో చేసిన పొరపాట్లని మళ్లీ రిపీట్ చేయకుండా అడుగులు వేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నియోజక వర్గంలో మంచి పట్టు ఉండటం టీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశం.

ప్లస్ పాయింట్స్

అధికార పార్టీ అభ్యర్థి

నియోజకవర్గంలో మంచిపట్టు

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు

మునుగోడులో అభివృద్ధి పనులు

మైనస్ పాయింట్స్

టీఆర్ఎస్ లో వర్గపోరు

బీజేపీలోకి వలసలు పెరగడం

బూరనర్సయ్యగౌడ్ లాంటి నేతలు వెళ్లిపోవడం

ఇక కంచుకోటలో కాంగ్రెస్ కిందమీద పడుతూ ముందుకుసాగుతోంది. అయినా ప్రచార దూకుడు కొనసాగిస్తూనే ఉంది.రేవంత్ రెడ్డి ఎటాకింగ్ స్పీచ్
కాంగ్రెస్ కేడర్ లో జోష్ నింపుతోంది.

ప్లస్ పాయింట్స్

మహిళా సెంటిమెంట్

కంచుకోటలో హార్డ్ కోర్ ఫ్యాన్స్

రేవంత్ రెడ్డి ఎటాకింగ్ స్పీచ్

మైనస్ పాయింట్స్

బీజేపీలో ముమ్మర వలసలు

కీలక నేతలు వెళ్లిపోవడం

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండటం

మొత్తానికి మునుగోడు తీన్మార్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది. దుబ్బాక,హుజూరాబాద్ స్ట్రాటజీని బీజేపీ పాలో అవుతుంటే హుజూర్ నగర్ , నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేస్తుంది. చూడాలి ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో.