Murali Vijay gets into physical fight with DK fans during Tamil Nadu Premier League match
mictv telugu

భార్య మాజీ భర్తకు జైకొట్టిన ఫ్యాన్స్‌.. గొడవపడ్డ మురళీ విజయ్

July 30, 2022

టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో రూబీ ట్రిక్కీ వారియర్స్ తరఫున ఆడుతున్న మురళీ విజయ్‌.. స్టార్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఫ్యాన్స్‌పై నోరు పారేసుకున్నాడు. మ్యాచ్ సందర్భంగా మురళీ విజయ్ ఫ్యాన్స్ తో గొడవకు దిగాడు. ఏకంగా స్టాండ్స్ లోకి వెళ్లి వాళ్లను కొట్టబోయాడు. బౌండరీ లైన్ దగ్గర విజయ్ ఫీల్డింగ్ చేస్తుండగా.. ఫ్యాన్స్ డీకే.. డీకే అంటూ నినాదాలు చేశారు. దాంతో కోపానికి గురైన విజయ్.. వారి వద్దకు వెళ్లి గొడవ పడ్డాడు. మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు సైతం విజయ్ పై ఎదురుతిరిగారు. వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వచ్చి విజయ్ ని గ్రౌండ్ లోకి పంపారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం కూడా ఒక మ్యాచ్ లో విజయ్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తుండగా.. మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు డీకే.. డీకే అంటూ దినేశ్ కార్తీక్ పేరును పలుకుతారు. ఫ్యాన్స్ పదే పదే దినేష్ కార్తీక్ పేరు జపించడంతో.. మురళీ విజయ్ ఇబ్బంది పడ్డాడు. తనను ఫ్యాన్స్ ఎగతాళి చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. పర్సనల్ విషయాలను ప్రస్తావించొద్దని కోరాడు. బౌండరీ లైన్ దగ్గర ప్రేక్షకులకు దండం పెట్టి వేడుకున్నాడు. ఈ దృశ్యాలను ఓ అభిమాని వీడియో తీసి పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది. దినేశ్ కార్తీక్ మొదటి భార్యను మురళీ విజయ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కార్తీక్ తన మొదటి భార్య నికితకు విడాకులు ఇచ్చాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.