Murder accused cuts birthday cake while sitting inside police van in Maharashtra Caught on camera
mictv telugu

పోలీస్ వ్యాన్‌లో గ్యాంగ్‌స్టర్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ వీడియో

August 22, 2022

పలు హత్య కేసుల్లో నిందితుడైన ఓ గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ నిమిత్తం జైలు నుంచి ఫుల్‌ బందోబస్తు మధ్య వ్యాన్‌లో కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇంతలో జైలు వద్ద ఆ గ్యాంగ్‌స్టర్‌ అనుచరులు ప్రత్యక్షమయ్యారు. పోలీస్‌ వ్యాన్‌లో ఉన్న అతనితో కేక్‌ కట్‌ చేయించి వేడుక చేసుకున్నారు. దీన్నంతా వీడియోతీసి తమ వాట్సప్‌ స్టేటసుల్లో పెట్టుకున్నారు. అదికాస్తా వైరల్‌ అవడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్ నగర్‌లో జరిగింది.

https://www.indiatoday.in/india/story/maharashtra-video-murder-accused-cutting-birthday-cake-sitting-inside-police-van-viral-1990819-2022-08-22?jwsource=cl

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉల్హాస్‌నగర్‌కు చెందిన రోషన్ ఝా గ్యాంగ్‌స్టర్. అతడిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు హత్య కేసులు, దోపిడీ కేసులు నమోదై ఉన్నాయి. ప్రస్తుతం జైలులో ఉన్న రోషన్ ఝాను ఓ కేసు విషయంలో కల్యాణ్‌లోని కోర్టులో హాజరు పరిచేందుకు జైలు నుంచి తీసుకొచ్చారు. రోషన్‌ను జైలు నుంచి బయటకు తీసుకురాగానే అప్పటికే అక్కడికి చేరుకున్న అతడి మద్దతుదారులు బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం కేక్ తీసుకొచ్చారు. దానిని తీసుకున్న రోషన్ ఝా పోలీసు వ్యాన్‌లో కూర్చునే కేక్ కట్ చేశాడు. అతడు కేక్ కట్ చేస్తుండగా అనుచరులు వీడియో తీసి దానిని వారు తమ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకున్నారు. దీంతో అది కాస్తా వైరలై విమర్శలకు దారితీసింది. హత్య కేసు నిందితుడు పోలీస్ వ్యాన్‌లోనే కేక్ కట్ చేస్తుంటే పోలీసులు చూస్తూ ఎలా ఊరుకున్నారని ప్రశ్నిస్తున్నారు.