జగన్‌పై దాడి చేసిన వ్యక్తి ఇతనే… - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌పై దాడి చేసిన వ్యక్తి ఇతనే…

October 25, 2018

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై దాడి జరిగింది. కొద్దిసేపటికి విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్‌లో కూర్చున్న జగన్‌పై ఓ వ్యక్తి కోళ్ల పందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేశారు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్‌ జగన్‌పై దుండగుడు దాడి చేశాడు.  Murder Attack on YS Jagan at Vizag airport.దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. ఇతనిది తూర్పు గోదావరి జిల్లా ముమ్మడిచెరువు మండలం తానిలంక గ్రామం. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తి కత్తికి ఏదైనా విషం పూసినట్లు వైసీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతం జగన్ విశాఖ నుంచి హైదరాబాద్‌కు విమానంలో బయలుదేరారు.