మరో జర్నలిస్టుపై కాల్పులు  - MicTv.in - Telugu News
mictv telugu

మరో జర్నలిస్టుపై కాల్పులు 

September 7, 2017

గౌరి లంకేశ్ హత్యకు గురై రెండు రోజులు గడవకముందే మరో జర్నలిస్టుపై హత్యాయత్నం జరిగింది. బిహార్ అర్వాల్ జిల్లాలో ఓ పాత్రికేయుడిపై గురువారం దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రాష్ట్రీయ సహారా హిందీ పత్రికలో పనిచేస్తున్న పంకజ్ మిశ్రా బ్యాంకులో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, మోటార్ బైకులపై వచ్చిన దుండగులు వెనకవైపు నుంచి కాల్పులు జరిపారు. రెండు తూటాలు ఆయన వెన్నులోంచి దూసుకెళ్లాయి. గాయాలతో రోడ్డుపై పడిపోయిన మిశ్రాలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. దుండుగులు మిశ్రా వద్ద నుంచి రూ. లక్ష నగదును కూడా దోచుకెళ్లారని పోలీసులు చెప్పారు.  గత ఏడాది కూడా బిహార్ లో ఇద్దరు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు వీరిని చంపారు..