Murder attempt on Mleye Jeevan Reddy.. Four others arrested
mictv telugu

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం..మరో నలుగురు అరెస్ట్

August 10, 2022

Murder attempt on Mleye Jeevan Reddy.. Four others arrested

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై గతకొన్ని రోజులక్రితం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్యాయత్నానికి సంబంధించి బుధవారం బంజారాహిల్స్ పోలీసులు మరో నలుగురిని అరెస్ట్ చేశామని మీడియా ముందు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రసాద్‌కు సహకరించిన సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్లను అరెస్టు చేశామని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.

”ఈ నెల 8న ప్రధాన నిందితుడు ప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్న సమయంలో కొన్ని వివరాలను సేకరించాం. నాంపల్లిలో ఎయిర్ పిస్టల్, మహారాష్ట్రలోని నాందేడ్‌లో కత్తి, బిహార్‌లో దేశవాళీ తుపాకీ కొనుగోలు చేసినట్లు గుర్తించాం. దేశవాళీ తుపాకీ, ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేసేందుకు సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్ కలిసి ప్రసాద్‌కు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా బిహార్‌కు చెందిన మున్నా కుమార్ నుంచి రూ. 60వేలకు ప్రసాద్ దేశవాళీ తుపాకీ కొనుగోలు చేశాడు. తుపాకీ విక్రయించిన మున్నా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రసాద్‌ను కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది” అని డీసీపీ వెల్లడించారు.