దేశంలో మహిళలపై నేరాలకు తెరపడటం లేదు. ఉత్తర ప్రదేశ్ ఒక యువతి మోచేయిని నరికేశాడో మృగాడు. యువతి తన మానాన తను రోడ్డు మీద వెళ్తుండగా అటుగా వచ్చిన ఈ కామాంధుడు ఆమెపై లైంగిక వేధింపులకు తెగబడ్డాడు. యువతి ప్రతిఘటించేసరికి కత్తితో ఆమె చేతిని నరికేసి పారిపోయాడు.
లఖీమ్ పూర్ ఖీరీలో ఈ దారుణం జిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలని వెంటనే ఆస్పత్రికి తరలించారు.