ఇంగ్లిష్ మాట్లాడుతూ గేలిచేశాడని 54 సార్లు పొడిచి చంపాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఇంగ్లిష్ మాట్లాడుతూ గేలిచేశాడని 54 సార్లు పొడిచి చంపాడు

March 23, 2018

ఒక్కోసారి చిన్న తగాదాలు చినికిచినికి గాలీవానాగా మారి హత్యలకు దారితీస్తుంటాయి. ఇంగ్లిష్‌లో గలగలలా మాట్లాడుతూ, తనకు చదువు రాదని ఎగతాళి చేశాడని ముంబై యువకుడు తన స్నేహితుణ్ని దారుణంగా హత్య చేశాడు. 54సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. సాహూనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ వహిద్‌ రహీన్‌ (21), అలామ్‌ షేక్ (18) స్నేహితులు. రహీన్ పెద్దగా చదువుకోలేదు. ఇంగ్లిష్ రాదు. అయితే షేక్‌ మాత్రం అతనితో ఎప్పుడూ ఇంగ్లిష్‌లోనే మాట్లాడుతూ వెక్కిరించేవాడు. కొన్నాళ్లు ఇది సహించిన రహీన్ గురువారం మాత్రం సహించలేకపోయాడు.

పక్కా పథకం ప్రకారం.. షేక్‌న బాంద్రాలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతనితో కలసి మందుకొట్టాడు.  షేక్‌తో మద్యం ఎక్కువగా తాగించాడు. తర్వాత తన స్నేహితుడే అన్న సంగతిని కూడా మరచిపోయిన కసితో పొడిచి చంపాడు. మొదట గొంతు కోసి, తర్వాత పొట్టలో, ఛాతీలో పొడిచాడు. తర్వాత సాహునగర్ పోలీస్ ఠాణాలో లొంగిపోయాడు. పోలీసులు రహీన్‌ను రిమాండ్‌కు పంపించారు.