రేప్ కేసుల్లో సాక్షులు స్వర్గానికే.. అయ్యోర్ల దయ! - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ కేసుల్లో సాక్షులు స్వర్గానికే.. అయ్యోర్ల దయ!

October 22, 2018

మన దేశం అత్యాచారాల అడ్డాగా మారిపోతోంది. దోషులకు శిక్షలు పడకపోవడంతో నేరాలు ఏమాత్రం తగ్గడం లేదు. దోషులుగా తేలిన దినకూలీలు వంటివారికి వారం తిరగకముందే ఉరిశిక్షలు విధిస్తున్న కోర్టులు ప్రముఖుల విషయంలో మాత్రం తాత్సారం చేస్తున్నాయి. దీనివల్ల బాధితులకు న్యాయం జరగకపోగా సాక్షుల ప్రాణాలు కూడా పోతున్నాయి. కేరళ నన్‌పై పాశవిక అత్యాచార కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చిన కురియకోస్ కుట్టుథారా ఈ రోజు జలంధర్ చర్చిలో శవమై కనిపించాడు.

Rape case witness killings a brand tradition in India involved spiritual gurus and influence people no protection for the journalists' Rape case witness

చంపుతామని తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. అత్యాచార కేసులో సాక్షులు ‘అనుమానాస్పదంగా మృతి’ మన దేశంలో కొత్తేమీ కాదు. జైల్లో ఊచలు లెక్కబెడుతున్న ఆశారాం బాపూజీ తన అనుచరులతో పలువురు సాక్షులను చంపించినట్లు పోలీసులు తేల్చారు. మొన్నటి ఉన్నావ్ గ్యాంగ్ రేప్ కేసులోనూ సాక్షి యూనస్ బలయ్యాడు. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ నిందితుడు. అతడే చంపించాడని హతుడి కుటుంబం ఆరోపిస్తోంది. రేపిస్టు బాబాగా ఎనలేని ఖ్యాతి మూటగట్టుకున్న డేరా బాబా కూడా సాక్షులను చంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాక్షులనే కాకుండా తన ఆశ్రమంలో జరిగే ఘోరాలపై కథనాలు రాసిన జర్నలిస్టులను కూడా హత్య చేయించినట్లు బాధితులు చెబుతున్నారు.

ఏ రేపిస్టు బాబా చరిత్ర చూసిన ఒక హత సాక్షి కనబడతాడు.. శాంతి, సహనాలకు చిహ్నాంగా ఉండాల్సిన బాబాలు, స్వాములు, బిషప్పులు, ముల్లాలు.. నానా మతాల బోధకులు కేసుల్లో, ముఖ్యంగా రేప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటే సాక్షులకు నూకలు చెల్లినట్లేనని భావించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఆధ్యాత్మిక మహానుభావులకు రాజకీయ నాయకుల, పోలీసుల అండదండలు ఉండడంతో అటు రేప్ కేసులే కాదు, సాక్షుల హత్యలు కేసులు కూడా ఎప్పటికీ తేలవు..ఇలాంటి కేసుల్లో సాక్ష్యాలు చెప్పడానికి ఇక ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు.