ఇన్ఫోసిస్ లో ఏం జరుగుతున్నది. లోపల ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తే గాని తెలియని వార్తలన్నీ కుప్పలు తెప్పలుగా బయటకు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు ఏకంగా బోర్డు సభ్యులు, వ్యవస్థాపకులు ఓపెన్ లెటర్లు రాస్తున్నారు. మీడియాకు ఎక్కుతున్నారు. సంస్థ సీఈవో విశాల్ సిక్కా రాజీనామా తర్వాత పరిస్థితి మరింత హీట్ ఎక్కినట్లుంది. సెబి కూడా స్పందించింది. ఇంతలా పరిస్థితి మారడానికి కారణం ఏమిటనేది అంతటా వ్యక్తం అవుతున్న సందేహం.
దీనికి ఆన్సర్ అంత ఈజీగా దొర్క పోవచ్చు. అయితే లోపల జరుగుతున్న పరిణామాలు, వేతన ప్యాకేజీల విషయంలో వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఆవేదన చెంది ఓపెన్ గా కామెంట్ చేశారు.
ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఉద్యోగులు, ఇన్వెస్టర్ల పట్ల బాధ్యతగా ఉండాలని సూచించారు. ఆయన మాటకు తిరుగు లేక పోయినా కొన్ని కారణాల వల్ల, కొందరి ప్రవర్తన, పని తీరు సంస్థను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని అంటున్నారు. ఇదే విషయంపై పలు మార్లు, బోర్డు లోపల, బయటా మూర్తి చెప్పి చూశారు. పరిస్థితి మారక పోవడంతో ఓపెన్ గా కామెంట్లు చేస్తున్నారట.
అయితే మూర్తిని ఉద్దేశించి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన ఓంకార్ గోస్వామి మూర్తిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో లేఖ రాశారు. మూర్తి గారు తప్పకుంటే మంచిదని సూచించారు.
విశాల్ సిక్కాను గోస్వామి సమర్థించారు. ముందు ముందుపరిస్థితి ఎట్లా మారుతుందో తెలియదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు, ప్రతీష్టలున్న సంస్థ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మరి.