బిన్‌ లాడెన్ మా హీరో.. ముషారఫ్ సంచలన వ్యాఖ్య - MicTv.in - Telugu News
mictv telugu

బిన్‌ లాడెన్ మా హీరో.. ముషారఫ్ సంచలన వ్యాఖ్య

November 14, 2019

పాక్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యంతో పోరాటం చేసేందుకు కశ్మీరీలకు ముజాహిదీన్‌తో ట్రైనింగ్ ఇచ్చామంటూ వ్యాఖ్యానించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ పొలిటిషియన్ ఫర్హతుల్లా బాబర్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంట్లో లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలపై ఆయన ప్రశంసలు కురింపిచారు. 

ఒసామా బిన్ లాడెన్, జలాలుద్దీన్ హక్కానీలు కూడా పాక్ హీరోలంటూ వ్యాఖ్యానించారు.1979లో సోవియట్ యూనియన్ సైన్యాన్ని తరిమేందుకు తాము తాళిబన్లకు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. అయితే ప్రపంచమంతా వ్యతిరేక భావనతో చూడటంతో హీరోలంతా విలన్లుగా మారిపోయారని చెప్పారు. వీటితో పాటు భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడే ముజాహిదీన్‌లకు గౌరవ స్థానం ఇచ్చామని పేర్కొన్నారు. వారితో కశ్మీరీలకు శిక్షణ ఇప్పించామని తెలిపారు. కశ్మీర్ నుంచి వచ్చిన వారికి పాక్‌లో గౌరవ సత్కారాలు కూడా చేసినట్టు వెల్లడించారు. ముషరఫ్ చేసిన  ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.