ఆ డిపో బస్సులు రోడ్డెక్కనే లేదు..కారణం ఇదే..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ డిపో బస్సులు రోడ్డెక్కనే లేదు..కారణం ఇదే..!

November 20, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 47వ రోజుకు చేరుకుంది. గత ఆర్టీసీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత సుదీర్ఘ కాలం సమ్మె కొనసాగుతోంది. కార్మికులు దిగిరాకపోవడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుడా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అన్ని డిపోల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకొని బస్సులను నడిపిస్తోంది. కానీ ఒక్క ముషీరాబాద్ డిపో2 నుంచి మాత్రం ఒక్కబస్సు కూడా బయటకు రాలేదు. దీంతో ఆ బస్సు డిపో సమ్మె చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. 

Musheerabad.

రాష్ట్రంలో మొత్తం 97 బస్‌ డిపోలు ఉన్నాయి. వాటిల్లో ముషీరాబాద్ డిపో2 మినహా మిగితా 96 చోట్ల ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో బస్సులను తిప్పుతోంది. ఆ డిపోలో 140 బస్సులకు ఒక్కటంటే ఒక్కటి కూడా బయటకు రావడంలేదు. ఇలా బయటకు రాకపోవడానికి ఓ కారణం కూడా ఉంది. నిజానికి ఈ డిపోలో అన్ని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద 2012లో కేంద్రం మంజూరు చేసినవే ఉన్నాయి.  టాటా కంపెనీ తయారు చేసిన ఈ బస్సులు మిగితా వాటికి పూర్తి భిన్నంగా ఉంటాయి. సాధారణ బస్సులు నడిపే డ్రైవర్లు వీటిని నడపడటం కొంత కష్టంగానే ఉంటుంది. అందుకే ఈ బస్సులను బయటకు తీయకుండా అలానే ఉంచారు. 

ఆర్టీసీ కార్మికులకు గతంలోనే ఈ బస్సులు నడిపేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అందువల్ల అప్పట్లో ఏ సమస్య లేకుండా నైపుణ్యం కలిగిన వారితో తిప్పేవారు. కానీ కొత్తగా వచ్చిన వారు ఇబ్బంది పడితే ప్రమాదాలు జరుగుతాయని భావించి వాటిని పక్కన పెట్టారు. కాగా ఇప్పటికే ఆ బస్సుల ఫిట్‌నెస్ కూడా సరిగాలేదు. ఎక్కడైనా ఆగిపోతే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. ఈ తలనొప్పులు ఎందుకని వాటిని ముట్టుకోవడమే పనేశారు.ఫలితంగా సమ్మె కాలంలో ఆ డిపో నుంచి ఒక్క బస్సూ బయటకు రాకపోవడం విశేషం.