బాలీవుడ్‌లో విషాదం నింపిన కరోనా.. సంగీత దర్శకుడి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌లో విషాదం నింపిన కరోనా.. సంగీత దర్శకుడి మృతి

June 1, 2020

Music Director.

బాలీవుడ్‌లో కరోనా విషాదాన్ని నింపింది. తన సంగీతంతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఉపేసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ (42) మరణించారు. అనారోగ్యానికి తోడు కరోనా వ్యాధి కూడా సోకడంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుండగా ఇది జరిగింది. చిన్న వయసులోనే ఆయన ప్రాణాలు కోల్పోవడంతో సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.  ఈ వార్త విని తామంతా షాక్ అయ్యామని పలువురు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

వాజిద్ ఖాన్ చాలా రోజులుగా కిడ్నీ, గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ అని కూడా తేలింది. దీంతో ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి చనిపోయారు.మ్యూజిక్​ కంపోజ‌ర్​ సలీమ్​ మర్చంట్ ఈ విషయాన్ని ధృవీకరించారు. కాగా ఆయన సల్మాన్​ఖాన్ లాక్​డౌన్​‌లో కరోనాపై చేసిన‘భాయ్ భాయ్’, ‘ప్యార్ కరోనా’లకు సంగీతం కూడా అందించారు. ‘ప్యార్ క్యా తో డర్నా క్యా మూవీతోనే సాజిద్-వాజిద్ ధ్వయం తమ కెరీర్‌ను ప్రారంభించారు. వీరిలో వాజిద్ లేకపోవడం పలువురు కలిచి వేసింది. వాజిద్ తన కెరీర్‌లో2007లో వచ్చిన పార్టనర్ సినిమాలో ‘సోనీదే నకరే’ 2009 వచ్చిన వాంటెడ్ సినిమాలోని ‘జాల్వా’, దబంగ్ సినిమాలోని ‘మున్నీ బద్నామ్ హుయి’లాంటి పాటలకు ఆయన సంగీతం అందించారు.