Home > Featured > మాకు తిండికి లోటు లేదు, అది సాయం కాదు.. చక్రి సోదరుడు 

మాకు తిండికి లోటు లేదు, అది సాయం కాదు.. చక్రి సోదరుడు 

Music Director Chakri Brother React On Media

చక్రి ఈ పేరు ఎంతో మందికి సుపరిచితం. ఒకప్పుడు తన సంగీతంతో ఎంతో మంది తెలుగు ప్రేక్షుకులను మైమరపింపజేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. లాక్‌డౌన్ సమయంలో తినడానికి ఇబ్బంది పడుతున్నారంటూ ప్రచారం జరిగింది. కోవిద సహృదయ ఫౌండేషన్ వ్యస్థాపకురాలు, నిర్మాత డాక్టర్ అనూహ్యరెడ్డి చక్రి తమ్ముడికి ఇచ్చిన మెడిసిన్ చూసి అంతా ఇది నిజమే అనుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ సైట్లు తప్పుడు వార్తలు రాశాయి. ఈ విషయం తెలిసిన మహిత్ స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసిన వార్తలను ఆయన ఖండించారు.

తాము తిండికి ఇబ్బంది పడుతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని మహిత్ స్పష్టం చేశారు. ‘నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లలేను అందుకే అనూహ్యరెడ్డి నాకు మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆమె మంచి మనసుతో ఈ పని చేసి పెట్టారు. ఆమె నాతో కరోనా వైరస్‌పై ఒక పాట కూడా చేయించుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇది జరిగింది. కానీ మీడియా మాత్రం వక్రీకరించి చూపించింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు అక్కలు, తల్లితో కలిసి తాను ఆనందంగా ఉన్నట్టు చెప్పారు. తాను ఇప్పటికి కొన్ని సినిమాలకు సంగీతం అందిస్తున్నానని, తిండికి ఎటువంటి లోటు లేదన్నారు. లగ్జరీగా బతకకపోయినా తిండి కోసం యాచించాల్సిన పని లేదని చెప్పారు. తాను సంగీతం సమకూర్చిన పరారీఅనే సినిమా ఆడియో కూడా ఇటీవల విడుదలైన విషయాన్ని తన వీడియోలో చెప్పుకొచ్చారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకుంటే మంచిదని హితవు పలికారు.

Updated : 8 May 2020 2:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top