కరోనాపై కీరవాణి పాట..శ్రోతలను కదిలిస్తోంది - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాపై కీరవాణి పాట..శ్రోతలను కదిలిస్తోంది

April 1, 2020

Music director mm keeravani song on coronavirus

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. దీని  ప్రభావానికి ఎన్నో దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎందరో కళాకారులూ ముందుకు వస్తున్నారు. కొందరు కవితలు రాస్తున్నారు. మరికొందరు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

ఇటీవల కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సంగీత దర్శకుడు కోటి ఓ పాటను రూపొందించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కనిపించారు. తాజాగా మరో సంగీత దర్శకుడు కీరవాణి ‘వి విల్‌ స్టే ఎట్‌ హోమ్‌.. వి స్టే సేఫ్‌’ అంటూ ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1 చిత్రంలోని ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి’ సాంగ్‌ను పేరడి చేశారు. ఈ పాటను కీరవాణి ట్విట్టర్ లో షేర్ చేయగా మంచి స్పందన లభిస్తోంది. ఇక ఈ భయంకర వైరస్‌ను అరికట్టడంలో డాక్టర్లు, నర్సులు, పోలీసులు, శానిటైజేషన్, మెడికల్ డిపార్ట్‌మెంట్‌ల కష్టాన్ని కీరవాణి తన పాటలో వివరించారు.