కీరవాణికి అరుదైన వ్యాధి.. మైండ్, బాడీ లింక్‌కు దెబ్బ - MicTv.in - Telugu News
mictv telugu

కీరవాణికి అరుదైన వ్యాధి.. మైండ్, బాడీ లింక్‌కు దెబ్బ

September 22, 2020

200 సినిమాలకు పైగా సినిమాలకు సంగీతం అందించి లెజండరీ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎంఎం కీరవాణి అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు. ఎంఎస్‌ (మల్టిపుల్‌ సెలిరోసిస్‌) అనే వ్యాధితో తాను బాధ పడుతున్నట్లు కీరవాణి వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా వీడియో ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా తాను ఈ అరుదైన వ్యాధితో సతమతమవుతున్నట్టు పేర్కొన్నారు. ‘ఈ వ్యాధి కేవలం నా వయసు వాళ్లకే వస్తుంది. ఇది ఏ వయసు వాళ్లకైనా ఎప్పుడైనా రావచ్చు. ఈ వ్యాధి మెదడుకు శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతీస్తుంది. ఈ వ్యాధిపై ‘ఎంఎస్‌ ఇండియా’ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వానికి తన గళాన్ని వినిపిస్తుంది’ అని వీడియోలో కీరవాణి వెల్లడించారు. 

ఈ వ్యాధితో బాధ పడుతున్నవాళ్లు ధైర్యంగా ఉండేలా ఇతరులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. యోగా, మ్యూజిక్‌ వంటి వాటితో ఈ వ్యాధి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చుని కీరవాణి సూచించారు. కాగా, వందల సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి హిందీలోనూ పలు సినిమాలకు సంగీతం అందించారు. బాహుబలి తర్వాత ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకూ కూడా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ పాటల రికార్డింగ్ కూడా పూర్తైపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ చూసుకుంటున్నారు కీరవాణి. ఈ మధ్యే ఈయనకు కరోనా సోకగా, కోలుకున్నారు. ప్లాస్మా కూడా దానం చేసిన ఈయన ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కూడా మెల్లగా కోలుకుంటున్నారు.