సినీ ఇండస్ట్రీలో విషాదం.. సంగీత దర్శకుడు కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

సినీ ఇండస్ట్రీలో విషాదం.. సంగీత దర్శకుడు కన్నుమూత

October 12, 2020

Music Director Rajan Passed Away.

సినీ ఇండస్ట్రీలను వరుసగా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా కన్నడ సంగీత దర్శకుడు రాజన్ తుదిశ్వాస విడిచారు. కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో చనిపోయారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలకు ఆయన సంగీతం అందించారు. 

మైసూరులో జన్మించిన ఆయన సినీ రంగంలోకి ప్రవేశించారు. తన సోదరుడు నాగేంద్రతో కలిసి అనేక సినిమాలకు సంగీతం అందించారు. 1952లో వచ్చిన సౌభాగ్యలక్ష్మి చిత్రంతో వీరి సినీ ప్రస్థానం ప్రారంభమయ్యింది. 1957లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అచ్యారు. విఠాలాచార్య సినిమాతో మంచి పేరు వచ్చింది.  తెలుగులో అగ్గిపిడుగు, ఇంటింటి రామాయణం, సొమ్మొకడిది సోకొకడిది,  అద్దాల మేడ, నాలుగుస్తంభాలాట, వయ్యారిభామలు-వగలమారిభర్తలు, మంచుపల్లకి, ప్రేమఖైది, అప్పుల అప్పారావు వంటి పలు సినిమాలకు సంగీతం సమకూర్చారు. కాగా. రాజన్ సోదరుడు నాగేంద్ర పదేళ్ల క్రితం చనిపోయారు.