పాటకు సరికొత్త రాగాలు, గమకాలు నేర్పిన సంగీత స్ట్రష్ట ఇళయరాజా హైదరాబాద్ నగరంలో సందడి చేయడనున్నారు. తన బృందంతో కలసి కచేరీ నిర్వహించనున్నారు. ఈ నెల(ఫిబ్రవరి) 26 గచ్చిబౌలి స్టేడియంలో లైవ్ కన్సర్ట్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. తెలుగు, తమిళ సినీగీతాలను, ప్రత్యేక గీతాలను ఆయన, ఆయన టీమ్ గాయనీ గాయకులు ఆలపిస్తారు. టికెట్ల ధరలు సీటింగ్ ఏర్పాట్లను బట్టి రూ. 1900 నుంచి పదిహేను వేలరకు వరకు ఉన్నాయి. దీనికి సంబంధించి ఓ ప్రచార వీడియోను నిర్వాహకులు విడుదల చేశారు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఇసై గ్నాని ప్రస్తుతం కచేరీల్లో బిజీగా ఉన్నారు. యాభై ఏళ్ల కెరీర్లో ఆయన దేశవిదేశాల్లో 20వేలకుపైగా కచేరీలు చేశారు.