నైంటీస్ పాప్ మెమెరీస్   - MicTv.in - Telugu News
mictv telugu

నైంటీస్ పాప్ మెమెరీస్  

June 16, 2017

గతం ఎప్పుడూ తీపి జ్నాపకమే. సంగీత ప్రియులు అందుకు మినహాయింపు కాదు. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే వాళ్ళ పెదవుల మీద అప్పుడే కొత్త రూపం తొడుక్కున్న పాటలు. అది 90 వ దశకం . పాటకు కొత్త శాస్త్రం, సాంకేతికత తోడైన దశకం అది. పాత పాటలకు కొత్త పోపులు.. అదే రీమిక్స్.. అంతేకాదు జనవాణిని కూడా ఇస్త్రీ కోటు వేసి సరికొత్తగా ముస్తాబు చేసిన రోజులు. పాటల పూదోటలో సరికొత్త విప్లవాన్ని తెచ్చిన పాటలు. యూత్ లో ఊపును తీస్కొచ్చిన ఫోక్ రొటీన్ ఫార్మాట్ కి నయా రివల్యూషన్ ని తీస్కొచ్చిన ఘనత పాప్ సాంగ్స్ కే దక్కుతుంది.ఆ దశకమే ఒక వినూత్న దశకం. రెగ్యులర్ సాంగ్స్ ను బీట్ చేసే పాప్ అల్బమ్స్ వెల్లువలా వచ్చి విశేషంగా ప్రేక్షకులను అలరించాయి. బాలీవుడ్ సంగీత ప్రపంచంలో ఫోక్ సాంగ్స్ రావడమే ఒక పెద్ద తుఫానును చెలరేపాయి. ఎవరి డీవిడిని ముట్టకున్నా పాప్ సాంగ్సే. ఏ హోటల్లో చాయ్ తాగుదామని పోయినా అవే పాటల వూపు. ఆటోల్లో, బస్సుల్లో, కార్లల్లో, పెళ్ళిళ్ళలో, పార్టీలలో.., ఎక్కడ చూసినా ఈ పాటలే. వెల్లువలా దూసుకొచ్చి ఒక ప్రభంజనాన్నే సృష్ఠించాయి. ఇళ్ళల్లో ఎవ్వరి ముని వేళ్ళైనా ‘ సుర్ సంగీత్ ’ ఛానల్ నే నొక్కేవి. ట్రెండును సెట్ చేసిన దశకం. తీన్మార్ బీట్ లతో యూత్ కు చాలా దెగ్గరైన సాంగ్స్ కేవలం పాపే.

ఫోక్ : 

జానపదం అనేది ప్రజల జనజీవనంలోంచి వచ్చింది. ఎప్పటినుండో ప్రజల జీవనంలో ఒక భాగం ఫోక్. వూళ్ళల్లో చాలా మంది పనులు చేస్కుంటూ సరదాగా గుణగుణ పాటలు పాడుకుంటూ పని అలసటని మరిచిపోయేవారు. అలాగే ఇంటికొచ్చాక ఆటవెలదిగా కోలాటం, డ్రామాల వంటివి ప్రదర్శించుకునేవారు. అప్పట్లో సినిమా, టీవీ అనే మాధ్యమాలు పల్లె ప్రజలకు అంతగా అందుబాటులో లేని రోజుల్లో పల్లె వాసులకు జానపద కళల్లో ఆరితేరడమే గొప్ప రిలీఫ్. జానపదం ఒక ఫార్మాట్లో పుట్టింది కాదు. పుట్టిన తర్వాత ఫార్మాట్ ను రూపుదిద్దుకుంది.

ఫోక్ సినీ సంగీతంలోకి రాక :

1990 ల కాలం బాలీవుడ్ చరిత్రను జానపద పాటలు ఊపు ఊపిన దశకం. లక్కీ అలీ,రాగేశ్వరి, బల్లీ సాగో, అలీషా చినాయ్, ఎఫోరియా బాండ్, శేఖర్ అలీషా, హన్స్ రాజ్ హన్స్, దలేర్ మెహెందీ, ఫాల్గునీ పాఠక్, బాంబే వికింగ్స్, బాంబే రాకర్స్.,, వంటి సామాన్యులే ఫోక్ ను ఇండస్ట్రీలోకి ఇంటడ్ర్యూస్ చేసి అసామాన్యలయ్యారు. సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిపోయిన  RD. బర్మన్ సాంగ్స్ ను రీమిక్స్ చేసి రీమిక్స్ మజాను ప్రేక్షకులకు అందించి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన దశకం నైంటీస్.  పంజాబీ, గుజరాతీ, మరాఠీ, రాజస్థానీ.., వంటి ప్రాంతీయ భాషా జానపదాలు వచ్చాయి. అప్పటివరకు హిందీ పాటల్లో డబల్ మీనింగ్ పదాల డొల్లతనం విపరీతంగా కొనసాగుతున్నప్పుడు వాటికి చెంపపెట్టులా నీట్ గా, మంచి బీట్లతో వచ్చాయి ఫోక్ సాంగ్స్. పంజాబీ సాంగ్స్ విపరీతంగా సంగీతాభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.అప్పటివరకు సినిమా వాసన తెలియని జానపద పాటలు విశేషంగా ప్రజాదరణ పొందటంతో చాలా సినిమాల్లో ఈ పాటలను, ఈ పాటలు పాడిన సింగర్స్ ని తీస్కున్నారు. పాకీస్తానీ సింగర్ అద్నాన్ సమీ సూఫీ పోక్ ను పరిచయం చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాడు. అలాగే అక్కీ అలీ వెస్ట్రన్ ఫోక్ ను తీస్కొచ్చి సంచలనానికి కేంద్ర బిందువయ్యాడు.

జనాల అస్థిత్వంలో దాగిన ఫోక్ సినిమా సంగీతంతో మిక్స్ అయి రావడంతో చాలా మంది వాటిని ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. అంతే కదా జనాల మీద మన పైత్యం రుద్దకుండా జనాలకు ఏం నచ్చుతుందో అది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అనడానికి ఈ ఫోక్ అల్బమ్సే ఎక్జాంపుల్ !

ప్రజాదరణ పొందిన మోస్ట్ వాంటెడ్ పాప్ సాంగ్స్

1. క్యా సూరత్ హై.. బాంబే వికింగ్స్ వారు చేసిన ఈ పాప్ సాంగ్ ఫస్ట్ పాప్ సాంగ్ గా నిలిచింది. రాజు సుందరం అద్బుతమైన పర్ ఫార్మెన్స్ ఇందులో వుంటుంది.

2. పరీ హుం మై.. ధుంవా అల్బం నుండి సంగీతా రావు పాడిన ఈ సాంగ్ హిట్టాప్ లిస్టులో వుండింది.

3. భీగి భీగి రాతోంమే.. రీమిక్స్ గా వచ్చిన ఈ పాట కుర్రకారును ఉర్రూతలూగించింది.

4. షాల్ లేజా లేజారె.. ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ అండ్ శ్రేయాఘొషాల్ గానం ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. బ్యూటిఫుల్ మెలెడీగా ఆకట్టుకుంది.

5. యాద్ పియాకి.. ఫాల్గుని పాఠక్ నుండి వచ్చిన అద్భుతమైన సాంగ్ ఇది..

6. తన్హా దిల్.. షాన్ పాడిన ఈ పాట టీనేజ్ లో మిస్సైన మెమెరీస్ ని గుర్తు చేస్తుంది.

7. ఇష్క్ తడ్ పావె.. సుఖ్ బిర్ సింగ్ గున్ గునాయించిన ఈ సాంగ్ పెళ్లిళ్ళలో, పార్టీలలో దుమ్ము రేపింది.

8. తేరీ తాన్ యాద్ సతావె.. బాంబె రాకర్స్… డానిష్ ఇండియన్ ఫోక్ మిక్స్ అయిన అద్భతమైన హిట్ అల్బమ్ సాంగ్ ఇది.

9. కభీ ఆనా తూ మేరీ గలీ.. ఇందులో విద్యాబాలన్ పర్ ఫార్మెన్స్ చేసిందంటే అప్పుడు ఈ ఫోక్ ఎంత హిట్టైందో వూహించుకోవచ్చు.

10. ఓ సనమ్.. లక్కీ అలీ.. ఎంత విన్నా ఇప్పటికీ వినాలనిపించే గొప్ప పాట ఇది.

11. తునక్ తునక్.. దలేర్ మెహెందీ.. పంజాబీ ఫోక్ లో వచ్చిన ఈ సాంగ్ మామూలు ఊపు ఊపలేదు.. దలేర్ మెహెందీకి పాప్ స్టార్ హోదానిచ్చిన సూపర్ డూపర్ హిట్ సాంగ్.

12. బొట్టాలన్ షరాబ్ దియాం.. బాలీ సాగూ.. ఈ సాంగ్ వింటే హనీ సింగ్ ఇలాంటి పాటల నుండి ఎంతో ఇన్ స్పైర్ అయ్యాడేమో అనిపిస్తుంది.

13. ఆంఖోమేం.. ఆర్యన్.. యూత్ లవ్ ఫీల్ ను అవిష్కరించిన ఈ పాటలో కుర్రవాడిగా షాహిద్ కపూర్ పర్ ఫార్మె న్స్ చెయ్యటం విశేషం.

14. మేడ్ ఇన్ ఇండియా..ఆయిషా చినాయ్.. రొమాంటిక్ ని టచ్ చేస్తూ ఫాస్ట్ బీట్ లో సాగిన ఈ సాంగ్ అమ్మాయిల హార్ట్ బీట్ అయిపోయింది.

15. యారోం.. కెకె.. ఫ్రెండ్ షిప్ వ్యాల్యూని వినిపించిన ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ లిస్టులో చేరిపోయింది.

16. దీవానా తేరా.. సోనూ నిగమ్.. ఆలపించిన ఈ పాట లవ్ లోని ప్యూరిటీని ఆవిష్కరిస్తుంది.

17. దీవానే,, శ్వేతా శెట్టి.. రొమాంటిక్ కామెడీగా సాగే ఈ సాంగ్ క్రేజీ సాంగ్ గా నిలబడింది.

18. చనావె ఘర్ .. కునాల్ గంజ్ వాలా.. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే సాంగ్ ఇది.

19. థోడీ సీ తో లిఫ్ట్ కరా దె.. అద్నాన్ సమీ.. సూపర్ హిట్ సాంగ్ గా మన ఖడ్గం సినిమాలో గోవిందా గోవిందా పాటకు ఇన్స్పి రేషన్ అయింది.

20. బ్రీత్ లెస్.. శంకర్ మహదేవన్..  పాడిన ఈ పాట ప్రయోగాత్మక పాప్యులర్ హిట్ పాప్ సాంగ్ గా నిలబడింది.

ఇలా చెప్పకుంటూ పోతే యాభై, వందా పాటలు అనే ఒక ప్రామాణిక లిస్టు మాత్రమే సరిపోదు. చెప్పుకుంటూ పోతే ఒడవని ముచ్చటలా చాలా వుంది పాప్ సాంగ్స్ కథ. ఇప్పటికీ ఈ పాటలు విని ఊగిపోయేవాళ్ళున్నారు.  ప్రాంతీయంగా తమ అస్థిత్వాలను చాటే ఏకైక మాధ్యమం ఫోకే. ఫోక్ కి సినిమా టచ్ ఇవ్వటంతో అవి ఇంకా ప్రజాదరణ పొందాయని చెప్పొచ్చు. తెలంగాణా జానపదాలు కూడా ఎంత వూపును తీస్కొచ్చాయో మనందరికీ తెలుసిన సంగతే. తెలంగాణా ఉద్యమానికి ఊపిరినిచ్చింది కూడా జానపద పాటే !

https://www.scoopwhoop.com/entertainment/90s-hindi-pop-songs/#.e7hj1k21w

– సంఘీర్