Muslim boys threaten Hindu girls with weapons in jarkhand
mictv telugu

జార్ఖండ్‌లో మరో దారుణం.. హిందూ అమ్మాయిలను ఆయుధాలతో బెదిరించిన ముస్లిం కుర్రాళ్లు

September 12, 2022

Muslim boys threaten Hindu girls with weapons in jarkhand

జార్ఖండ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముస్లిం అబ్బాయిలు హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. స్నేహితులుగా ఉంటారా? లేదా కిడ్నాప్ చేయమంటారా? అంటూ ఆయుధాలతో బెదిరించారు. అడ్డు వచ్చిన టీచర్లు, సిబ్బందిని కూడా బెదిరించారు.

అంతేకాక, దాడి తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర రాజధానిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో బాధిత అమ్మాయిలు 9వ తరగతి చదువుతున్నారు. వారిలో కొందరు గిరిజన, హిందూ బాలికలు ఉన్నారు. వారం రోజుల నుంచి కొందరు ముస్లిం విద్యార్ధులు స్నేహం చేయాలని వారిని వేధిస్తున్నారు. తాజాగా బరితెగించి ఆయుధాలతో బెదిరించగా, స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాక, విచారణ కోసం ఐదుగురు సభ్యులతో కూడిన దర్యాప్తు బృందాన్ని నియమించారు. అయితే ఇప్పటివరకు ఈ కేసులో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి నౌషద్ ఆలం మాట్లాడుతూ.. ఈ ఘటనకు మతం రంగు పులమొద్దని కోరారు. పోలీసులు అమాయకుల జోలికి వెళ్లరని, అలాగే దోషులను వదిలిపెట్టరని పేర్కొన్నారు. మరోవైపు ఈ సంఘటనపై బీజేపీ అధికార పార్టీపై విరుచుకుపడింది. లవ్ జిహాద్, పోకిరీ సంఘటనలు ఎక్కువైపోతున్నాయని, ప్రభుత్వం చేతకానితనంతో చేష్టలుడిగి చూస్తోందని మండిపడింది. కావాలనే ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కపెడుతోందని ధ్వజమెత్తింది. కాగా, ఇటీవలే దుమ్కా పట్టణంలో ప్రేమను నిరాకరించిందన్న కోపంతో హిందూ యువతిపై ముస్లిం యువకుడు పెట్రోల్ పోసి తగులబెట్టాడు. యువతి తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కొన్ని రోజుల తర్వాత ఓ గిరిజన బాలికను ఓ ముస్లిం వ్యక్తి హత్య చేసి చెట్టుకు వేలాడదీశారు. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు లవ్ జిహాద్‌లో భాగమని బీజేపీ, హిందూ సంఘాలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వం వాటిని కొట్టిపారేస్తూ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్తోంది.