స్నేహమేరా జీవితం.. ఆలయాన్ని కాపాడిన ముస్లింలు  - MicTv.in - Telugu News
mictv telugu

స్నేహమేరా జీవితం.. ఆలయాన్ని కాపాడిన ముస్లింలు 

October 30, 2019

Kali.

మత సామరస్యతకు భారత్ పుట్టినిల్లు. మనదేశంలో అన్ని మతాల పండుగలను అందరూ జరుపుకుంటారు. హిందువుల ముఖ్య పండుగైన దీపావళిని ముస్లింలు కూడా జరుపుకుంటారు. దీపావళి పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు విరాళాలు సేకరించి కాళీమాత దేవాలయాన్ని పునరుద్ధరించి హిందువులకు బహుమతిగా ఇచ్చారు.

బిర్భుమ్ జిల్లాలోని బసాపురా ప్రాంతంలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో ఉన్న కాళీమాత మందిరం రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు వెడల్పు పనుల్లో శిధిలమైంది.  దాన్ని మరింత శిథిలం కాకుండా కాపాడ్డానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆ దేవాలయానికి సమీపంలో ఉన్న ముస్లిం సోదరులు విరాళాలు సేకరించి దానిని పునరుద్ధరించారు. ఆ దేవాలయాన్ని నసిరుద్దీన్ మండల్ అనే మజీద్ మౌల్వి ఆదివారం దీపావళి పండుగ రోజున ప్రారంభించారు. ఓ మజీద్ మౌల్వి హిందూ దేవాలయాన్ని ప్రారంభించడం బహుశా ఇదే తొలిసారి కావడం విశేషం.