మతాలకు అతీతంగా జరిగిన ఓ పెళ్లి వేడుక ఇప్పుడు అందరినీ అమితంగా ఆకర్షిస్తోంది. ఓ ముస్లిం జంట హిందూ ఆలయంలో వివాహం చేసుకుని హిందూ- ముస్లిం భాయి భాయి అని మరోసారి చాటిచెప్పింది. హిందూ , ముస్లింల బంధానికి మరింత బలాన్ని అందించింది.
అసలు విషయానికి వస్తే సిమ్లా జిల్లాలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబంలో వివాహం నిశ్చయమైంది. వీరిది పేద కుటుంబం. పెళ్లి చేసుకునేంత స్థోమత లేదు. ఇది గమనించిన స్థానిక విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధులు ఆ జంటకు ఆసరాగా నిలవాలనుకున్నారు. స్థానికంగా ఉన్న సత్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈ జంటకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటే అన్న నినాదంతో హిందూ దేవాలయంలో వీరికి ముస్లిం మత ఆచారాల ప్రకారం పెళ్లి చేశారు. హిందూ సంస్థలు ముస్లింలకు వ్యతిరేకం అని జరుగుతున్న తప్పుడు ప్రచారాల నేపథ్యంలో హిందువులే ముందుండి ముస్లిం జంట పెళ్లి చేసి మనుషుల మధ్య రాజకీయాలు ఉండవని నిరూపించారు.