హరియాణాలో పెద్ద ఎత్తున మతమార్పిడులు జరిగాయి. 40 ముస్లిం కుటుంబాలకు చెందిన 250 మంది హిందూమతంలోకి మారారు. హిసార్ జిల్లా భీత్మడాలో జరిగిన ఈ అంశం అందరిని ఆకర్షించింది. అంతే కాకుండా వీరంతా ఇటీవల ఓ వృద్ధురాలు మరణిస్తే ఆమె ఖననం సైతం హిందూ సంప్రదాయ పద్దతిలో నిర్వహించారు. తాము తిరిగి హిందూ మతంలోకి రావడం సంతోషంగా ఉందంటూ వారంతా చెప్పుకొచ్చారు.
మొఘల్ పాలకుడైన ఔరంగజేబు కాలంలో ఈ గ్రామంలో చాలా మంది బలవంతంగా మత మార్పిళ్లకు గురయ్యారని పేర్కొన్నారు. గతంలో తామంతా హిందువులమేననే విషయం తెలుసుకొని తిరిగి తమ పూర్వ మతంలోకి వచ్చినట్టు చెప్పారు. ఇదంతా తాము ఇష్టపూర్వకంగానే చేశామని ఎటువంటి ఒత్తిడులు లేవని పేర్కొన్నారు. కాగా గతంలో కూడా ఇక్కడి ముస్లింలు పండగలు జరుపుకునే వారు. కేవలం ఎవరైనా చనిపోతే మాత్రం ఇస్లాం పద్దతిలో చేసేవారు. తాజాగా వీరంతా మతం మారడంతో ఇక నుంచి తాము అన్నింటిని హిందూ సంప్రదాయంలోనే చేస్తామని స్పష్టం చేస్తున్నారు.