ఇటీవల కాలంలో దేశంలో సంచలనం సృష్టించిన అంశాల్లో హిజాబ్ వివాదం ఒకటి. దీనిపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పును వెల్లడించగా, విభేదించిన ముస్లిం యువతులు కొద్ది గంటల్లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు ఒప్పుకోలేదు. హోలీ పండుగ అనంతరం విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. దీనిపై స్పందించిన న్యాయవాది సంజయ్ హెగ్డే.. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చాలా మంది ప్రభావితమవుతారనీ, పైగా పరీక్షలు దగ్గర పడుతున్నందున విచారణ అత్యవసరమని కోరగా, ‘క్షమించండి. మాకు సమయం కావాల’ని జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.