ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ముస్లిం నేత.. ఎక్కడంటే  - MicTv.in - Telugu News
mictv telugu

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ముస్లిం నేత.. ఎక్కడంటే 

September 23, 2020

bngvnv

మన దేశంలో ప్రతి చోట మత సామరస్యానికి కొదవే ఉండదు. ఒక మతం దేవుళ్లకు మరో మతం వారు పూజలు చేయడం సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. తాజాగా నామక్కల్‌లో ప్రసిద్ధిచెందిన ఆంజనేయ స్వామి ఆలయానికి ఓ ముస్లిం పెద్ద వెళ్లారు. ప్రత్యేక పూజలు చేసి అర్చకుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.మతసామరస్యం చాటే విధంగా తమిళనాడు ఏక్తా జమాత్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం ఈ పూజలు చేశారు.

ఇటీవల కేంద్రం నూతన విద్యా విధానం, వ్యవసాయ బిల్లులు తీసుకురావడంతో దీన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే సహా కొన్ని మిత్ర పక్షాలు ఆందోళన చేపట్టాయి. దీన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కూడా  నామక్కల్‌ ఫ్లవర్‌ బజార్‌ రోడ్డులో ధర్నా చేపట్టింది. కుట్రలను తిప్పికొడతాం అంటూ ఆందోళనకు దిగారు. దీనికి ఏక్తాజమాత్‌ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం మద్దతు పలికారు. అక్కడికి వచ్చిన ఆయన ధర్నా తర్వాత నేరుగా  నామక్కల్‌ ఆంజనేయ స్వామి, నరసింహస్వామి ఆలయాలకు వెళ్లి దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరు లౌకిత తత్వాన్ని అలవరుచుకోవాలని సూచించారు.