శైవపీఠంలో ప్రధాన పూజారిగా ముస్లిం.. చరిత్రలో తొలిసారి.. - MicTv.in - Telugu News
mictv telugu

శైవపీఠంలో ప్రధాన పూజారిగా ముస్లిం.. చరిత్రలో తొలిసారి..

February 20, 2020

Muslim Man Set To Become Seer At Karnataka's Muruga Rajendra Mutt

కులమత విభేదాలకు వ్యతిరేకంగా పోరాడిన బసవేశ్వరుడికి కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా కోట్ల మంది అనుచరులు ఉన్నారు. ఆయన బోధనలు హిందువులతోపాటు ఇతర మతాలూ పాటిస్తుంటాయి. కర్ణాటకలో కొందరు ముస్లింలు కూడా బసవడి బాటలో నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో.. గదగ్ జిల్లాలోని లింగాయతుల మఠంలో తొలిసారిగా ఒక ముస్లిం ప్రధాన పూజారిగా బాధ్యతతలు చేపట్టనున్నారు. 

అసూతి గ్రామంలో ఉన్న మురుగరాజేంద్ర కోరనేశ్వర శాంతిధామ మఠ ప్రధాన అర్చకుడిగా దివాన్ షరీఫ్ రహిమాన్ సాబ్ ముల్లా అనే 33 ఏళ్ల ముస్లిం ఈ నెల 26న బాధ్యతలు స్వీకరించనున్నారు. ముల్లా తల్లిండ్రులు ముస్లింలైనా బసవేశ్వరుడి బోధనలు పాటిస్తున్నారు. ఆయన తండ్రి మూడేళ్ల కిందట మఠానికి రెండెకరాల ఎకరాలు దానం చేశారు. 350 ఏళ్ల కిందట స్థాపించిన ఈ శైవమఠంలో ములా మూడేళ్లు లింగాయత మతాన్ని అభ్యసిస్తున్నారు. గత ఏడాది నవంబరులో దీక్ష తీసుకున్నారు. ‘మా తల్లిదండ్రులు నన్ను బవసడి సేవలకు అంకితం చేశారు. ఆయన బోధనలను నేను ప్రచారం చేస్తాను.. ’ అని ఆయన అంటున్నారు.