అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం.. వక్ఫ్ బోర్డు - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం.. వక్ఫ్ బోర్డు

November 9, 2019

Muslim personal.

అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు కేటాయిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేసులో కక్షిదారైన సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. తీర్పుపై పునస్సమీక్ష కోరుతూ కోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపింది. తీర్పు మాకు ఆమోదయోగ్యం కాకపోయినా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చింది కనుక గౌరవిస్తామని పేర్కొంది. మసీదు ఉన్న భూమికి బదులుగా వేరే చోట 5 ఎకరాలు ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది. తీర్పుపై అప్పీలుకు వెళ్లే అంశంపై చర్చిస్తున్నామని, తమ కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. కాగా, ఈ తీర్పుతోనైనా దేశంలోని ఇతర మసీదుల జోలికి పోరని ఆశిస్తున్నట్లు మరో కక్షిదారు ఇక్బాల్ అన్నారు. వివాదాస్ప భూమి తమదే అని సున్నీ వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోవడంతో కోర్టు రాంలల్లాకు భూమిని కేటాయించింది.