ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు, చట్టం కూడా తెస్తాం..  - MicTv.in - Telugu News
mictv telugu

ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు, చట్టం కూడా తెస్తాం.. 

February 28, 2020

Muslim reservations.

కేంద్రంలోని తమ పాత మిత్రపక్షం బీజేపీతో సీఏఏ, ఎన్సార్సీ వంటి విషయాల్లో గొడవ పడుతున్న శివసేన ముస్లింలకు చేరువయ్యేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. మహారాష్ట్రలోని విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అక్కడి శివసేన ప్రభుత్వంలోని మంత్రి చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొస్తున్నట్లు మైనార్టీ  వ్యవహారా శాఖ మంత్రి న‌వాబ్ మాలిక్ తెలిపారు.  

స్కూళ్ల అడ్మిష‌న్ల స‌మ‌యంలో ఈ రిజ‌ర్వేష‌న్ వ‌ర్తిస్తుంద‌ని, బిల్లులను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని వెల్లడించారు. ఈ కోటాను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ తెచ్చే ఆలోచన ఉందని, దీనిపై న్యాయ సలహాలు తీసుకుంటామని అన్నారు. నేషనలిస్ట్ కంగ్రెస్ పార్టీకి చెందిన మాలిక్ శివసేన సర్కారులో మైనారిటీల ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెబుతుంటారు.