Home > Featured > ఖమ్మం : స్వంత నిధులతో రామాలయం నిర్మించిన ముస్లిం సర్పంచ్

ఖమ్మం : స్వంత నిధులతో రామాలయం నిర్మించిన ముస్లిం సర్పంచ్

ఖమ్మం జిల్లాలో హిందూ - ముస్లిం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఓ సంఘటన జరిగింది. రఘునాథపాలెం మండలం బూడిదం పాటు గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైన షేక్ మీరాసాహెబ్.. తన స్వంత నిధులు రూ. 25 లక్షలతో రామాలయం నిర్మించారు. స్థానికులు కూడా తోచినంత సహాయం చేయడంతో గుడి నిర్మాణం పూర్తయింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారు, సోషల్ మీడియాలో మీరా సాహెబ్‌ను ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్.. ఓ పత్రికలో వచ్చిన క్లిప్ షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ షేక్ మీరా సాహెబ్ స్పందిస్తూ.. ‘హిందూ సంస్కృతి, సాంప్రదాయాలంటే నాకు చిన్నప్పటి నుంచి గౌరవం. ఆచార వ్యవహారాలు ఆకట్టుకునేవి. అందుకే హిందూ సోదరులకు ఏదైనా చేయాలనిపించి వారి ఆరాధ్య దైవం శ్రీరాముడి గుడి కట్టాలని సంకల్పించాను. అందరి సహకారంతో గుడి అద్భుతంగా నిర్మించాము’ అని అభిప్రాయపడ్డారు.

Updated : 21 Jun 2022 3:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top