ఆరెస్సెస్‌కు ముస్లిం మహిళ ఫిదా.. భారీ విరాళం  - MicTv.in - Telugu News
mictv telugu

ఆరెస్సెస్‌కు ముస్లిం మహిళ ఫిదా.. భారీ విరాళం 

March 30, 2020

Muslim woman donates to rss social service wing seva bharati

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ముస్లింలకు వ్యతిరేకమని చెబుతాయారు. కానీ ఆ సంస్థ కార్యకర్తలు కొందరు ప్రకృతి విపత్తులు సంభవించినప్పు సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ సేవాభారతి నిర్వహిస్తున్న సేవలకు ఓ ముస్లిం మహిళ ఫిదా అయ్యారు. ఏకంగా రూ. 5 లక్షలను ఆ సంస్థకు విరాళంగా ప్రకటించారు. మక్కా యాత్రకు వెళ్లడానికి దాచుకున్న డబ్బును విరాళంగా ఇవ్వడం మరో విశేషం. లాక్‌డౌన్ బాధితులకు సేవాభారతి ఆహారం, మంచినీళ్లు అందిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.  

జమ్మూకశ్మీర్‌కు చెందిన ఖలీదా బేగం అనే 87 ఏళ్ల వృద్ధురాలి దాతృత్వం ఇది. కరోనా కారణంగా హజ్ యాత్రకు వెళ్లడం వీలు కాకపోవడంతో ఆమె యాత్ర కోసం దాచుకున్న డబ్బును సేవాభారతికి ఇస్తానని ప్రకటిచారు. ఆరెస్సెస్ ప్రతినిధి అరుణ్ ఆనంద్ ఈ వివరాలు వెల్లడించారు. ఖలీదా కొడుకు, రిటైర్డ్ ఐపీఎస్ ఫరూఖ్ ఖాన్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సలహాదారుగా పనిచేస్తున్నారు.