టీడీపీ యువనాయకుడు నారా లోకేష్ యువగళం పేరుతో ఏపీలో చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ నుంచి ఊహించని మాట రావడంతో లోకేశ్‌తో పాటు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మంగళవారం మైనార్టీలతో ముఖాముఖీ మాట్లాడిన లోకేష్ సభలో ఓ మహిళ లేచి ‘మీరు ఎవరో మీ పేరు ఏంటో నాకు తెలియదు సార్’ అని నిర్మొహమాటంగా చెప్పేసింది. స్పందించిన లోకేష్. ఏం పర్లేదు మాట్లాడండి అంటూ ధైర్యం చెప్పారు.
ఈ వీడియోను వైసీపీ అభిమానులు షేర్ చేస్తూ తెగ ట్రోల్ చేసేస్తున్నారు. కాగా, పాదయాత్ర సందర్భంగా ముస్లిం మైనార్టీలకు లోకేష్ పలు హామీలిచ్చారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్‌గా తీసుకొని ఒక రెసిడెన్షియల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రోజు మాదిరి వైసీపీ, జగన్ పాలనను తీవ్రంగా విమర్శించారు.