Muslim woman threw 2 lakhs on the former CM siddha ramayya
mictv telugu

కర్ణాటక అల్లర్లు.. మాజీ సీఎంపై 2 లక్షలు విసిరి కొట్టిన ముస్లిం మహిళ

July 15, 2022

కర్ణాటక మాజీ కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్యకు శుక్రవారం ఊహించని ఘటన ఎదురైంది. కెరూర్ ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించి, వారికి ఆర్ధిక సహాయం చేసి తిరిగొచ్చే క్రమంలో ఓ ముస్లిం మహిళ తనకిచ్చిన రెండు లక్షల రూపాయలను విసిరికొట్టింది. అంతేకాక, ‘మాకు మీ డబ్బులు అవసరం లేదు. మీ సంతుష్టీకరణ రాజకీయాలు ఆపండి. బిచ్చమెత్తుకునైనా మేం మా కుటుంబాలను పోషించుకుంటాం. కానీ, బాధితులకు న్యాయం, ప్రశాంతంగా బతికే వాతావరణం కల్పించండి. హిందువైనా, ముస్లిమైనా సమానంగా చూడండి. మా దుస్థితికి కారణమైన వారిని శిక్షించండి’ అంటూ భావోద్వేగానికి లోనైంది.

కెరూర్ అల్లర్లు : జులై 6వ తేదీన తమ సోదరిని ఈవ్ టీజింగ్ చేశాడంటూ సోదరి అన్నదమ్ములు యాసిన్‌ను ప్రశ్నించారు. ఈ సమయంలో వాగ్వాదం జరుగగా, యాసిన్ తర్వాత తన 15 మంది స్నేహితులతో కలిసి దాడికి యత్నించాడు. దీంతో ఆగ్రహం చెందని యువతి సోదరులు తమ వారిని వెంటబెట్టుకుని రాగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇది క్రమంగా పెరిగి మతం రంగు పులుముకోగా, అసాంఘిక శక్తులు ప్రవేశించాయి. దీంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరుగగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన పోలీసులు 144 సెక్షన్ విధించి పరిస్థితిని కంట్రోల్ చేశారు. అనంతరం 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో గాయపడిని వారు కెరూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా, వారిని పరామర్శించేందుకు సిద్ధరామయ్య ఆస్పత్రికి వెళ్లారు. వారిని ఓదార్చి ఆర్ధిక సహాయం చేసి తిరిగి తన కాన్వాయ్ వద్దకు రాగా, బాధిత ముస్లిం మహిళ కాంగ్రెస్ వారు ఇచ్చిన రెండు లక్షల రూపాయలను కాన్వాయ్‌పై విసిరికొట్టింది.