హిందూ దుకాణంలో బట్టలు కొంటారా..? ముస్లిం మహిళలపై దౌర్జన్యం - Telugu News - Mic tv
mictv telugu

హిందూ దుకాణంలో బట్టలు కొంటారా..? ముస్లిం మహిళలపై దౌర్జన్యం

May 19, 2020

Muslim Women Buy Clothes In Hindu Shop

హిందువుల షాపునకు వెళ్లిన ముస్లిం మ‌హిళ‌లు దుస్తులు కొనడం పాపం అయిపోయింది. ఆ షాపులో ఎందుకు కొన్నారంటూ మిగితా ముస్లిం వ్యక్తులు వచ్చి వారిపై తిట్ల దండకం అందుకున్నారు. వాటిన్ని లాక్కుని తిరిగి ఇచ్చేయాలంటూ బెధింరించారు. కర్నాటకలోని దావ‌ణ‌గెరెలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ షాపులో కొంటే ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

రంజాన్ పండగ కోసం ఇద్దరు ముస్లిం మహిళలు బట్టలు కొనేందుకు ఓ హిందూ షాపునకు వెళ్లి తీసుకొని బయటకు వచ్చారు. వారు రావడం చూసిన కొంత మంది ముస్లిం వ్యక్తులు వారి వద్దకు వచ్చి దురుసుగా ప్రవర్తించారు. ఏవైనా కొనాల‌నుకుంటే ముస్లింల షాపుల‌కు వెళ్లాలి కానీ, హిందువుల దుకాణంలో కొన‌డ‌మేంటని వారిని ప్రశ్నించారు. అస‌భ్య ప‌ద‌జాలాన్ని ఉప‌యోగించి బెధిరించారు. వారి చేతుల్లో ఉన్న కవర్లను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.