Muslim women of Varanasi offering garlands to Shivalinga
mictv telugu

శివుడికే మా మద్దతు.. హారతులిచ్చిన వారణాసి ముస్లిం మహిళలు

September 14, 2022

Joined in bjp with god permission Goa Congress Veteran Digambar Kamat

వారణాసిలోని జ్ఞానవాపి- శృంగేరి గౌరి కేసులో మసీదు కమిటీ వాదనలను తిరస్కరించి హిందువుల పిటిషన్‌ను కోర్టు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. హిందువులకు ముస్లిం మహిళల మద్దతు లభించింది. ముస్లిం మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు శివలింగానికి హారతులివ్వడం కొత్త చర్చకు దారి తీసింది. అనంతరం ఫౌండేషన్ ప్రెసిడెంట్ నజ్నీన్ అన్సారీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో ముస్లిం మహిళలు మొదటినుంచి సత్యం వైపే ఉన్నారు.

హిందువులకు తామంతా సపోర్టుగా నిలుస్తాం. హిందువులంగా కాశీ విశ్వనాథ ఆలయం నుంచి ఔరంగజేబు కళంకాన్ని తుడిచేయాలని కోరుకుంటున్నారు. మా పూర్వీకులు హిందువులుగా ఉన్నప్పుడు ఈ దేవుడికి పూజలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఆది విశ్వేశ్వరుడిని ఎలా ఆక్రమించుకుంటాడు? మొఘల్ పాలకుల పాపాలను మోయడానికి ఇక్కడి ముస్లింలు సిద్ధంగా లేరు. ఆలయాన్ని కూల్చారనడానికి వేలాది సాక్ష్యాలు, రుజువులు ఉన్నాయి. హిందువులు ప్రపంచంలోనే అత్యంత సహనం కలిగిన వర్గం. వారి ప్రయత్నాలకు మద్ధతిచ్చి కోర్టు తీర్పును మేమంతా గౌరవిస్తాం’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే వారణాసి జిల్లా కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని అంజుమన్ ఇంతేజామియా కమిటీ తెలిపింది. అటు హిందూ పక్ష న్యాయవాది కూడా కేవియట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. మరి ముందు ముందు ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.