యోగి ఎఫెక్ట్ : యూపీలో టాటూలు వేసుకుంటున్న ముస్లిం యువత - MicTv.in - Telugu News
mictv telugu

యోగి ఎఫెక్ట్ : యూపీలో టాటూలు వేసుకుంటున్న ముస్లిం యువత

March 17, 2022

mmm

యూపీలో వరుసగా రెండోసారి గెలిచి ముఖ్యమంత్రి అవుతున్న యోగి ఆదిత్యనాథ్‌పై ముస్లిం యువతలో క్రేజ్ పెరిగిపోతోంది. ఆగ్రాలోని ముస్లిం యువకులు బుల్డోజర్ల టాటూలను తమ ఒంటిపై వేయించుకుంటున్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో బుల్డోజర్లు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అందులో చేపట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో యోగి ప్రభుత్వం కూలగొట్టింది. ఈ పరిణామాల పట్ల ప్రజల్లో పాజిటివ్ స్పందన నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభల్లో కూడా బుల్డోజర్లను ప్రాంగణంలో పార్క్ చేసేవారు. దీంతో బుల్డోజర్లకు ప్రజల్లో యమ క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మతపరమైన తేడా లేకుండా హిందూ, ముస్లిం యువకులు బుల్డోజర్లను తమ ఒంటిపై టాటూ వేయించుకుంటున్నారు. డానిష్ ఖాన్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘ యోగి, మోదీలకు నేను పెద్ద అభిమానిని. ముస్లింలు బీజేపీని శత్రువుగా చూస్తున్నారు కానీ, నేను చూడను. గత ప్రభుత్వాల హయాంలో లేని అభివృద్ధి కార్యక్రమాలను యోగి ప్రభుత్వం చేపట్టింది. పథకాలు హిందూ, ముస్లిం తేడా లేకుండా అందరికీ అందాయి. మాఫియా డాన్‌లు, హంతకులు ఉంటే జైళ్లలో ఉన్నారు. లేదా రాష్ట్రం విడిచి పారిపోయారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు చాలా మేలు జరిగింద’ని వెల్లడించారు.