హిందూ ఆలయంలో నమాజ్.. కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

హిందూ ఆలయంలో నమాజ్.. కేసు నమోదు

November 2, 2020

Muslim youth namaz hindu temple Mathura uttar Pradesh

హిందువు ఆలయంలోకి వచ్చిన నలుగురు అటూ ఇటూ తిరిగారు. తర్వాత వారిలో ఇద్దరు అక్కడే కూర్చుని ‘అల్లాహూ అక్బర్…’ అని నమాజ్ చేశారు. అవాక్కయిన ఆలయ సిబ్బంది తర్వాత అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై దుమారం రేగగా, పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలోని మధురలో ఉన్న నందగావ్ నందబాబా ఆలయంలో అక్టోబర్ 28న ఈ ఉదంతం జరిగింది. 

ముస్లింలు భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు వచ్చినట్లు తెలుస్తోంది. నమాజ్ చేసిన వారిని ఫైజల్ ఖాన్, మహ్మద్ చాంద్‌గా గుర్తించారు. వారితోపాటు గుడిలోకి వచ్చిన మరో ఇద్దర్నరి నీలేశ్ గుప్తా, అలోక్ గా గుర్తించారు. హిందూమతం, ఇస్లాం మతం రెండూ తమకు ఇష్టమని వీరు ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తొలుత దేవుణ్ని చూస్తామని చెప్పిన వీరు తర్వాత నమాజ్ చేశారు. ఫైజల్, మహ్మద్ నమాజ్ చేస్తుండగా మిగిలిన ఇద్దరూ వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మరికొందరు కూడా వీడియో తీశారు. సామరస్యం మంచిదేగాని ఆలయంలో ఇలాంటివి సరికావని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఎవరి మతం వాళ్లకు పవిత్రమని, ఆలయంలో నమాజ్ చేయడం వల్ల సామరస్యానికి బదులు అందోళన రేగుతుందని సేవదార్ కన్హా గోస్వామి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.