బట్టలు విప్పితే ముస్లింలో, కాదో.. బీజేపీ నేత వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

బట్టలు విప్పితే ముస్లింలో, కాదో.. బీజేపీ నేత వ్యాఖ్యలు

April 15, 2019

40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడులపై వివాదం కొనసాగుతూనే ఉంది. దాడి వివరాలను చెప్పాలని విపక్షాలు పట్టుబడుతోంటే, అవి దేశద్రోహ పార్టీలు అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు.. అక్కడ భారత ప్రభుత్వం చెప్పినట్లు 300 మంది ఉగ్రవాదులు చావలేని పాక్ కూడా అంటోంది. ఈ నేపథ్యంలో కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బాలాకోట్‌లో హతమైన వాళ్ల బట్టలు విప్పితే వాళ్లు ముస్లింలో కాదో, తెలుస్తుందని అన్నారు. ‘మన రాహుల్ గాధీ, సీతారాం యేచూరి, పినరయి విజయన్‌లు.. మన సైనికులు బాలాకోట్ వెళ్లి చచ్చినోళ్లను లెక్కించమంటున్నారు. వాళ్ల కులం, మతం తెలుసుకోవాలంటున్నారు. ముస్లింలను గుర్తించడానికి కొన్ని ఉన్నాయి కదా..  వాళ్ల బట్టలు విప్పితే తెలుస్తుంది… మనం ఆ పనిచేయాలి..’ అని పిళ్లై ఎన్నికల ప్రచారంలో అన్నారు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. మైనారిటీలను ఇలా కించపరచడం సరికాదని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అంటున్నాయి. అయితే తాను అలా అనలేదని, పిళ్లై చెప్పుకొచ్చారు.