ముస్లింలను 1947లోనే పాక్ పంపాల్సింది : కేంద్ర మంత్రి సంచలనం   - MicTv.in - Telugu News
mictv telugu

ముస్లింలను 1947లోనే పాక్ పంపాల్సింది : కేంద్ర మంత్రి సంచలనం  

February 22, 2020

Muslims Sent To Pakistan Union Minister

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీని వల్ల ముస్లింలకు నష్టం చేకూరే అవకాశం ఉందని భయాందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం వచ్చే సమయంలోనే ముస్లింలను పాకిస్తాన్ పంపించి ఉంటే ఇప్పుడు సమస్య ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ముస్లింలను టార్గెట్ చేసుకొని ఆయన అన్న ఈ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో ఆయన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

బిహార్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘1947 లోనే ముస్లింలందర్నీ పాకిస్తాన్‌కు పంపించి ఉండాల్సింది. ముస్లిం ప్రత్యేక దేశం ఏర్పడాలని జిన్నా ఒత్తిడి తెచ్చారు. అప్పుడే వాళ్లను పాకిస్తాన్‌కు పంపి అక్కడి హిందువులను ఇక్కడికి తీసుకొస్తే బాగుండేది. ఇప్పుడు మనం మూల్యం చెల్లిస్తున్నాం. భరత వంశీయులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వకపోతే, ఇంకెక్కడిస్తారు. మత హింసను ఎదర్కొంటున్నవారంతా వారెక్కడికి వెళ్తారు’ అంటూ గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారి తీశాయి. కాగా ఇటీవల కూడా ఆయన ఇలాగే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.