ముస్లింలు మసీదుల్లో ఆయుధాలు దాస్తున్నారు.. బీజేపీ ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

ముస్లింలు మసీదుల్లో ఆయుధాలు దాస్తున్నారు.. బీజేపీ ఎమ్మెల్యే

January 22, 2020

gng

కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి యడ్యూరప్పకు రాజకీయ కార్యదర్శి అయిన రేణుకాచార్య ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో ముస్లింలు పొడవాటి ఖడ్గాలు, కత్తులు, సోడా బాటిళ్లు,  ఇతర ఆయుధాలను దాస్తున్నారని అన్నారు. వారు తమ ప్రార్థనా మందిరాల్లో నమాజ్ చేయకుండా ఇలా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దావణగెరె జిల్లాలోని హొన్నళ్లిలో సీఏఏకి అనుకూలంగా జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ర్యాలీకి ముస్లింలు హాజరు కాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 

ఖాజీలు ‘ప్రబోధాలు’ చేయకుండా.. ఫత్వాలు జారీ చేస్తున్నారని అన్నారు. ‘సీఏఏకి మద్దతు ఇవ్వాలని నేను కోరినప్పటికీ ముస్లింలు ఇందుకు నిరాకరిస్తున్నారు. నా నియోజకవర్గానికి కేటాయించిన నిధులను నేను హిందువుల సంక్షేమానికే కేటాయిస్తాను’ అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఎస్.ప్రకాష్ స్పష్టం ఖండిచారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి.. పార్టీతో సంబంధం లేదని అన్నారు. మరోవైపు ఇదే పార్టీకి చెందిన మరో అధికార ప్రతినిధి మధుసూదన స్పందిస్తూ.. రేణుకాచార్య వ్యాఖ్యలను తాము సమీక్షిస్తామని, మసీదుల్లో ముస్లింలు నిజంగా ఆయుధాలు దాస్తున్నారా అన్న విషయాన్ని తెలుసుకుంటామని వ్యాఖ్యానించారు.