మనిషి ముఖంతో పుట్టింది.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

మనిషి ముఖంతో పుట్టింది.. (వీడియో)

September 11, 2019

అప్పుడప్పుడు జంతువులకు వింత శిశవులు జన్మిస్తుంటాయి. నాలుగు కాళ్లు, రెండు తలలు, తోక లేకుండా ఇలా పుడుతుంటాయి. కానీ, ఓ చోట మాత్రం ఆవుకు జన్మించిన దూడకు మానవ ముఖం వుంది. శరీరం అంతా ఆవులా వుండి, ముఖం మాత్రం మనిషిలా వుండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అరుదైన దూడ అర్జెంటీనాలోని విల్లా అనే గ్రామంలో జన్మించింది. అయితే, ఈ దూడ జన్మించిన కొద్ది సేపటికే చనిపోయింది. వింత రూపంలో ఉన్న ఈ దూడను చూసేందుకు జనాలు వస్తున్నారు. వచ్చినవాళ్లలో కొందరు ఈ దూడను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది. చాలామంది వీడియోలో వింత దూడను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఆవు మాదిరి ఈ దూడకు పెద్ద ముక్కు, చెవులు, నోరు లేకుండా, మనిషి తరహాలో చిన్నవిగా ఉన్నాయి. దాని పుర్రె కూడా మనిషి రూపంలోనే ఉంది. దీనిని పరిశీలించిన జన్యుశాస్త్ర నిపుణుడు నికోలస్ మ్యాగ్నాగో మాట్లాడుతూ.. జన్యు పరివర్తన వల్ల ఈ ఆవు దూడ ఆ రూపంలో పుట్టిందని అంటున్నారు. ఒక్కోసారి డీఎన్‌ఏల్లో మార్పు వల్ల ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పారు. భౌతిక, రసాయన లేదా జీవ సంబంధ చర్యల వల్ల దూడ జన్యు శ్రేణిలో మార్పులు జరిగడం వల్లే.. అది ఇలా జన్మించిందని అన్నారు.