చికెన్, మటన్ బిర్యానీలే ఆ గుళ్లో ప్రసాదం - MicTv.in - Telugu News
mictv telugu

చికెన్, మటన్ బిర్యానీలే ఆ గుళ్లో ప్రసాదం

January 26, 2020

Muniyandi Swamy Temple.

గుడికి వెళ్తే మనకు కొబ్బరి ముక్కో, చక్కెర పొంగలి, తీర్థం, పులిహోర వంటివి ప్రసాదంగా ఇస్తారు. కానీ, ఓ ఆలయంలో మాత్రం మటన్, చికెన్ ప్రసాదంగా పెడతారు. కావలిస్తే ఇంటికి ఆ నాన్‌వెజ్ ప్రసాదాన్ని ఇంకికి పార్శిల్ కూడా కట్టి ఇస్తారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నమ్మాల్సిందే. తమిళనాడులోని మధురై ప్రాంతంలో ఉన్న ఆ ఆలయం పేరు మునియాండి స్వామి ఆలయం. అక్కడ గత ఎనిమిదేళ్లుగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలే ప్రసాదాలుగా ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. 

ప్రతి సంవత్సరం జనవరి 24 నుంచి రెండ్రోజుల పాటు ఆ ఆలయం వద్ద ఉత్సవాలు జరుగుతాయి. వేలాదిగా భక్తులు మునియాండి ఆలయానికి తరలి వస్తారు. భక్తుల కోసం 1000 కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండి పెడతారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇదే ప్రసాదంగా అందిస్తారు. అంతేకాదు, ఆ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంటుంది. తమిళనాడులో ఉన్నన్ని ఆలయాలు మరే రాష్ట్రంలో ఉండవంటే అతిశయోక్తి కాదు. అయితే, ఆ రాష్ట్రంలోని మునియాండి స్వామి నాన్‌వెజ్ ఆలయం మాత్రం అన్నింటి కంటే చాలా ప్రత్యేకమైందిగా ప్రసిద్ధి చెందింది.