యూజర్స్ అభిరుచి మేరకు..కొత్త టెక్నాలజీని జోడించి సరికొత్త మొబైల్స్‌ను అందించే రియల్ మీ సంస్థ మరో అద్భుతమైన మొబైల్‌తో ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే రియల్ మీ జీటీ3 ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ కేవలం 9:30 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. 240 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదేనని కంపెనీ పేర్కొంది. వేగవంతమైన ఛార్జ్‌తో అప్డేట్ టెక్నాలజీ, ఫీచర్స్ ఈ కొత్త మొబైల్ సొంతం.
రియల్మీ జీటీ 3 ఫీచర్స్
4,600 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 9-10 నిమిషాల్లో పుల్ ఛార్జ్ చేయొచ్చు. వెనుక వైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మైక్రో సెన్సర్ ఉంటుంది. ముందు వైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను కలిగివుంది. ఐదు ర్యామ్, స్టోరేజీ (8జీబీ+128జీబీ, 12+256, 16జీబీ+256జీబీ, 16జీబీ+512జీబీ, 16జీబీ+1టీబీ)వేరియంట్లలో ఫోన్ వస్తోంది. జీటీ3 ఫోన్ ‘ఆర్‌జీబీ’ ప్రత్యేకతను కూడా కలిగి ఉంది. కాల్స్, మెసేజ్, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎల్‌ఈడీ అలర్ట్ వస్తుంది. యూజర్‌లు తనకు నచ్చినట్లుగా ఈ రంగులను మార్చుకోవచ్చు. 6.74 అంగుళాల 1.5కె అమోలెడ్, 144 హెచ్‌జెడ్ రీఫ్రెషర్ రేటుతో డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ ప్రాసెసర్ ఇందులో అమర్చారు.
ధర ..?
మార్కెట్లోకి ఈ ఫోన్‌ను ఇంకా విడుదల చేయలేదు. జీటీ3 అమ్మకాల వివరాలను రియల్ మీ సంస్థ వెల్లడించాల్సి ఉంది. అదే విధంగాను ధరపై కూడా క్లారిటీ రాలేదు.రియల్ మీ జీటీ 3 ప్రైస్ భారత మార్కెట్లో రూ. 53500 నుంచి ప్రారంభం కావొచ్చని సమాచారం.