పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పీటీఐ నేతలు, కార్యకర్తలు కూడా ఆయన ఇంటి వద్ద గుమిగూడారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేయకుండా వారు అడ్డుకోవడంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. దాన్ని ఎదుర్కొంటూనే పోలీసులు ఇమ్రాన్ ఇంటి వరకు పోలీసులు వెళ్లగలిగారు కానీ అరెస్ట్ మాత్రం చేయలేకపోయారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నట్లుగా చెబుతున్నారు.
ఇమ్రాన్ ఇంటికి పోలీసులు చేరుకునేందుకు అడ్డంకులు ఏర్పడటంతో, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల మీద పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అందుకు ప్రతిగా పీటీఐ కార్యకర్తలు రాళ్ళ వర్షాన్ని కురిపించారు. దీనిలో పీటీఐ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స చేస్తున్నారు. ఏ క్షణంలో అయినా ఇమ్రాన్ ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.
اپنی قوم کے لئے میرا پیغام!pic.twitter.com/Dv3i9X0S1J
— Imran Khan (@ImranKhanPTI) March 14, 2023
మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్టు చేసి జైల్లో తనను చంపేందుకు ప్లాన్ వేశారని ఆయన ఆరోపించారు. ఇదంతా బ్రిటన్ ప్లాన్ ఆయన అన్నారు. ఏం జరిగినా ప్రజలు చేస్తున్న పోరాటాన్ని మాత్రం అపొద్దని పిలుపునిచ్చారు ఇమ్రాన్ ఖాన్. తనను జైల్లో వేస్తే దేశం కామ్ గా ఉంటుందని అనుకుంటున్నారని…కానీ అది తప్పన్న విషయాన్ని నిరూపించాలని అన్నారు.
ఇమ్రాన్ కు అల్లా అన్నీ ఇచ్చారు. నేను మీ కోసం పోరాడుతున్నా, నా జీవితాన్ని మీకోసం పోరాడాను….ఇంకా పోరాడుతూనే ఉంటాను. జైల్లో నన్ను చంపేసినా మీరు పోరాడాలి. ఇమ్రాన్ లేకున్నా ఈ దేశంలో బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. ప్రధాని షాబాజ్ షరీఫ్ ఏకపక్ష నిర్ణయాల్ని తీసుకుంటున్నారు, వాటిని వ్యతిరేకించాలి అంటూ ఇమ్రాన్ ఖాన్ వీడియోలో చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.