నన్ను ఉరేసి చంపబోయారు.. చివరకు మా అమ్మ కూడా.. - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను ఉరేసి చంపబోయారు.. చివరకు మా అమ్మ కూడా..

May 6, 2022

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై దాడి చేసి, యువకుడిని అతి దారుణంగా దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. వేరే మతానికి చెందిన వ్యక్తిని తన సోదరి ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కక్షతో ఆమె అన్నే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా బాధితురాలు ఆశ్రిన్ సుల్తానా.. తన భర్త నాగరాజును హత్యచేసిన ఆమె అన్న మెబీన్ గురించి విస్తుపోయే విషయాలను తెలిపింది.

తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నానని తెలిసి తనను రెండు సార్లు ఉరితీసి చంపేందుకు ప్రయత్నించాడని సుల్తానా చెప్పింది. తన తల్లి కూడా నాగరాజును పెళ్లి చేసుకుంటే చంపేస్తామంటూ బెదిరించిందని తెలిపింది. చివరకు అన్నంత పని చేశారని, బైక్‌పై వెళ్తున్న తమన్ను వెంబడించి మరీ దాడి చేసి చంపారని వాపోయింది. వద్దని కాళ్లు పట్టుకున్నా తన అన్న కనికరించలేదని, నుంచి 20 నిమిషాల సేపు నాగరాజుపై ఇనుపరాడ్డుతో దాడి చేశారని, కత్తితో పొడిచారని చెప్పింది. తన భర్తపై దాడి జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని సుల్తానా విచారం వ్యక్తం చేసింది.